Vakeel Saab - పని పూర్తిచేసిన పవన్

Wednesday,December 30,2020 - 01:27 by Z_CLU

పవర్ స్టార్ Pawan Kalyan రీ ఎఁట్రీ మూవీ వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తన పార్ట్ షూటింగ్ పూర్తిచేశాడు పవన్ కల్యాణ్. షూటింగ్ చివరి రోజు లొకేషన్ లో పవన్ కల్యాణ్ తో క్రూ దిగిన పిక్స్ వైరల్ అయ్యాయి.

వకీల్ సాబ్ (Vakeel Saab) మూవీకి సంబందించి మరో షెడ్యూల్ మాత్రం పెండింగ్ లో ఉంది. బాలీవుడ్ లో హిట్టయిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. పవన్ కల్యాణ్ ఇమేజ్ కు తగ్గట్టు తెలుగులో భారీ మార్పుచేర్పులు చేశారు.

దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి, అనన్య, నివేత థామస్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

సంక్రాంతికి ఈ సినిమా టీజర్ రిలీజయ్యే అవకాశం ఉంది. సమ్మర్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతున్నాడు వకీల్ సాబ్.

Vakeel-saab-pawan-kalyan-stills 1 Vakeel-saab-pawan-kalyan-stills 1 Vakeel-saab-pawan-kalyan-stills 1