ZeeCinemalu – Jan 3

Saturday,January 02,2021 - 10:14 by Z_CLU

Killer_Movie_Stills_zeecinemalu

కిల్లర్ నటీనటులు : అర్జున్, విజయ్ ఆంటోనీ, ఆశిమా నార్వాల్, నాజర్, సీత, భగవతి పెరుమాల్, గౌతమ్, సతీష్, సంపత్ రాజ్ సంగీతం : సైమన్ కే కింగ్ సాహిత్యం , సంభాషణలు: భాష్యశ్రీ సినిమాటోగ్రఫీ : మాక్స్ ఎడిటర్ : రిచర్డ్ కెవిన్ ఆర్ట్ : వినోద్ రాజ్ కుమార్ బ్యానర్: పారిజాత మూవీ క్రియేషన్స్‌ నిర్మాతలు: టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్ రచన & దర్శకత్వం : ఆండ్రూ లూయిస్ ఆండ్య్రూ లూయిస్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని, యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘కొలైగారన్‌’.. దియా మూవీస్‌ బ్యానర్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్‌–టి.శ్రీధర్‌ ‘కిల్లర్‌’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. అషిమా క‌థానాయిక‌ గా నటిస్తుంది. సైమన్.కె.కింగ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా కి మాక్స్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.

================================== spyder-స్పైడర్-మూవీ-zeecinemalu-mahesh

స్పైడర్ నటీనటులు : మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ ఇతర నటీనటులు : S.J. సూర్య, భరత్, RJ బాలాజీ, ప్రియదర్శి, జయప్రకాష్, సాయాజీ షిండే మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్ డైరెక్టర్ : A.R. మురుగదాస్ ప్రొడ్యూసర్ : N.V. కుమార్, ఠాగూర్ మధు రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్ 2017 ఇంటలిజెన్స్ బ్యూరో లో పనిచేసే శివ(మహేష్ బాబు) అందరి కాల్స్ ట్రాప్ చేస్తూ తను రెడీ చేసుకున్న ఓ సాఫ్ట్ వేర్ ద్వారా సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికెళ్లి ఎలాంటి తప్పు జరగకుండా అడ్డుపడుతుంటాడు.. అలా సాటి మనిషికి ఎటువంటి బాధ కలగకూడదనే వ్యక్తిత్వంతో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా జీవితాన్నిగడిపే శివ, ట్రాప్ ద్వారా ఓ కాల్ వింటాడు. అనుకోకుండా విన్న ఆ కాల్ శివ జీవితంలో ఓ పెద్ద మార్పు తీసుకొస్తుంది.. ఆ ఫోన్ కాల్ విన్న మరసటి రోజే శివ జీవితంలోకి వస్తాడు భైరవుడు… ఇంతకీ భైరవుడు ఎవరు ? అసలు శివకి భైరవుడికి మధ్య ఏం జరిగింది ? చివరికి శివ భైరవుడిని ఎలా అంతమొందించి ప్రజల్ని కాపాడాడనేది సినిమా కథాంశం.

======================= paper-boy-zee-cinemalu-586x306

పేపర్ బాయ్ నటీనటులు : సంతోష్ శోభన్, రియా సోమన్ ఇతర నటీనటులు : తాన్యా హోప్, పోసాని కృష్ణ మురళి, అన్నపూర్ణ, బిత్తిరి సత్తి, సన్నీ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : భీమ్స్ డైరెక్టర్ : V. జయశంకర్ ప్రొడ్యూసర్ : సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహ రిలీజ్ డేట్ : 31 ఆగష్టు 2018 పేపర్ బాయ్ రవి, ధరణి ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే ఎప్పుడైతే వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలుస్తుందో అక్కడి నుండే సమస్య మొదలవుతుంది. మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన రవితో ధరణి పెళ్లి చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు అంత ఈజీగా ఒప్పుకోరు.. అప్పుడు రవి, ధరణి ఏం చేస్తారు..? తమ ప్రేమని ఎలా గెలిపించుకుంటారు. అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

======================== kukkalunnayi-jagratta-zee-cinemalu-569x320

కుక్కలున్నాయి జాగ్రత్త నటీనటులు : సిబిరాజ్, అరుంధతి ఇతర నటీనటులు : ఇదో, బాలాజీ వేణుగోపాల్, మనోబాల, మయిల్ సామి, ప్రింజ్ నితిక్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : ధరన్ కుమార్ డైరెక్టర్ : శక్తి సౌందర్ రాజన్ ప్రొడ్యూసర్ : సత్యరాజ్, మహేశ్వరి సత్యరాజ్ రిలీజ్ డేట్ : 21 నవంబర్ 2014 సిబిరాజ్, అరుంధతి జంటగా నటించిన ఇమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ ‘కుక్కలున్నాయి జాగ్రత్త’. మోస్ట్ ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ లో కుక్క కీ రోల్ ప్లే చేసింది. ఒక అమ్మాయి కిడ్నాప్ కేసును ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్ లో తన ఫ్రెండ్ ని కోల్పోతాడు పోలీసాఫీసర్ కార్తీక్. ఆ కిడ్నాపర్లను అంతం చేసే ప్రాసెస్ లో ఉన్న కార్తీక్ కి అనుకోకుండా మిలిటరీ ట్రైన్డ్ కుక్క స్నేహం ఏర్పడుతుంది. ఆ కుక్క పోలీసాఫీసర్ కార్తీక్ కి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఎలా సహాయపడింది..? అనేదే ఈ సినిమాలో మోస్ట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్.

========================== bhanumathi-and-ramakrishna-భానుమతి-రామకృష్ణ-fpc-zeecinemalu1-586x245

భానుమతి రామకృష్ణ నటీనటులు – నవీన్ చంద్ర, సలోనీ లూథ్రా, షాలినీ, రాజా చెంబోలు, వైవా హర్ష దర్శకుడు – శ్రీకాంత్ నాగోతి నిర్మాత – యశ్వంత్ ములుకుట్ల సంగీత దర్శకుడు – శ్రావణ్ భరధ్వాజ్ రిలీజ్ డేట్ – జులై 3, 2020 భానుమతి (సలోని లూత్రా) సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉన్న అమ్మాయి. హైదరాబాద్‌లోని ఓ యాడ్ ఏజెన్సీలో మేనేజర్‌గా పనిచేస్తుంటుంది. రామ్ (రాజా చెంబోలు)తో ఐదేళ్లుగా లవ్ లో ఉంటుంది. అయితే, వయసు ఎక్కువగా ఉందని భానుమతికి రామ్ బ్రేకప్ చెబుతాడు. దీంతో భానుమతి చాలా డిస్టర్బ్ అవుతుంది. లైఫ్ లో మరింత ఎగ్రెసివ్ గా, కోపంగా మారిపోతుంది. సరిగ్గా అదే సమయంలో తెనాలి నుంచి రామకృష్ణ (నవీన్ చంద్ర) హైదరాబాద్‌కు వస్తాడు. భానుమతి పనిచేసే కంపెనీలో చేరతాడు. భానుమతి లైఫ్‌స్టైల్‌కు పూర్తి రివర్స్ లో ఉంటుంది రామకృష్ణ జీవితం. ఉత్తర-దక్షిణ దృవాల్లాంటి వీళ్లిద్దరు ఎలా కలిశారు.. ఎలా ప్రేమలో పడ్డారు.. చివరికి ఏమైంది అనేది ఈ సినిమా స్టోరీ.

============================ thumbaa-zee-cinemalu-225x320

తుంబా నటీనటులు : దశన్, KPY ధీన, కీర్తి పాండ్యన్ ఇతర నటీనటులు : ధరణి వాసుదేవన్, జార్జ్ విజయ్ నెల్సన్, కళైయారసన్ కన్నుసామి మరియు తదితరులు మ్యూజిక్ కంపోజర్ : అనిరుద్ రవిచందర్, వివేక్ మెర్విన్, సంతోష్ దయానిధి డైరెక్టర్ : హరీష్ రామ్ L.H. ప్రొడ్యూసర్ : సురేఖ న్యాపతి రిలీజ్ డేట్ : 21 జూన్ 2019 అనుకోకుండా అడవిలోకి వచ్చి పడిన పులి (తుంబా), దానిబిడ్డ చుట్టూ తిరిగే కథే తుంబా. అలా ప్రమాదవశాత్తు అడివిలోకి వచ్చిన ఈ రెండింటి లెక్క గవర్నమెంట్ రికార్డ్స్ లో ఎలాగూ ఉండదు కాబట్టి వీటిని అమ్ముకుని ఎలాగైనా సొమ్ము చేసుకోవాలనే ఆలోచనలో ఉంటాడు అక్కడి ఫారెస్ట్ ఆఫీసర్. ఇదిలా ఉంటే ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్ళి ఫోటోస్ తీయడానికి పర్మిషన్ తీసుకున్న వర్ష తో పాటు, ఆ అడవికి దగ్గరలో పులి రియల్ స్టాచ్యూ తయారు చేసే పనిలో ఉన్న మరో ముగ్గురు ఈ విషయాన్ని గ్రహించి ఎలాగైనా ఆ పులిని, దానిబిడ్డని ఆ ఫారెస్ట్ ఆఫీసర్ నుండి కాపాడాలనుకుంటారు. ఇంతకీ తుంబని, దాని బిడ్డని వీళ్ళు కాపాడగలిగారా..? లేదా అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

======================== arjun-kurukshetram-movie-కురుక్షేత్రం-అర్జున్-zeecinemalu-389x320

కురుక్షేత్రం నటీనటులు -అర్జున్, శృతి హరిహరణ్, సుమన్, ప్రసన్న, వరలక్ష్మి శరత్ కుమార్, వైభవ్ దర్శకుడు – అరుణ్ వైద్యనాథన్ బ్యానర్ – శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాత – శ్రీనివాస్ మీసాల సంగీతం – ఎస్.నవీన్ రిలీజ్ – 2018, సెప్టెంబర్ 21 యాక్షన్ హీరో అర్జున్ కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన హీరోగా నటించినా, క్యారెక్టర్ పోషించినా… ఆయన స్థానం ప్రత్యేకం. అందుకే అభిమానులు ఆయన సినిమా కోసం ఎదురుచూస్తుంటారు. మరి అలాంటి యాక్షన్ హీరో అర్జున్ నటించిన 150వ సినిమా ఎంత ప్రత్యేకమో చెప్పక్కర్లేదు. యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన 150వ చిత్రం కురుక్షేత్రం. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత శ్రీనివాస్ మీసాల ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా, థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కింది కురుక్షేత్రం సినిమా. అర్జున్ యాక్టింగ్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్.

============================= Donga-karthi-దొంగ-కార్తి-zeecinemalu-568x320

దొంగ నటీనటులు – కార్తి, జ్యోతిక, సత్యరాజ్, నిఖిలా విమల్, సీత, ఇళవరసు దర్శకుడు – జీతూ జోసెఫ్ బ్యానర్ – వయకామ్ స్టుడియోస్, పారలల్ మైండ్స్ ప్రొడక్షన్ నిర్మాత – రావూరి వి శ్రీనివాస్ సంగీతం – గోవింద వసంత్ రిలీజ్ డేట్ – డిసెంబర్ 20, 2019 విలక్షణ నటుడు కార్తి, సీనియర్ హీరోయిన్ జ్యోతిక నటించిన సినిమా దొంగ. జ్యోతిక, కార్తీ కలిసి నటించిన తొలి చిత్రం ‘దొంగ’ (Donga). నిజ జీవితంలో వదిన-మరిది అయిన వీళ్లిద్దరూ ఈ చిత్రంలో అక్కాతమ్ముళ్లుగా నటించడం విశేషం. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘దృశ్యం’ చిత్రానికి దర్శకత్వం వహించిన జీతూ జోసేఫ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. సత్యరాజ్‌ తండ్రి పాత్ర పోషించిన ఈ చిత్రంలో Karthi సరసన ‘మేడ మీద అబ్బాయి’, ‘గాయత్రి’ ఫేమ్‌ నిఖిలా విమల్‌ హీరోయిన్ గా నటించింది. గోవాలో చిన్న చిన్న దొంగతనాలు, చీటింగ్ లు చేస్తూ ఫ్రీ బర్డ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు విక్కీ(కార్తీ). 15ఏళ్లుగా తప్పిపోయిన కొడుకు శర్వా కోసం వెతుకుతుంటారు తండ్రి జ్ఞానమూర్తి (సత్య రాజ్), అక్క పార్వతి(జ్యోతిక). బాగా డబ్బున్న ఈ కుటుంబంలోకి శర్వాలానే ఉన్న విక్కీని ప్రవేశపెడతాడు పోలీసాఫీసర్ జీవానంద్ (ఇళవరసు). డబ్బు కోసం అతడు ఈ పని చేస్తాడు. మరి శర్వా గా జ్ఞానమూర్తి కుటుంబంలోకి వెళ్లిన విక్కీ అక్కడ ఎదుర్కున్న పరిస్థితులు ఏమిటి? ఆ కుటుంబం అతనిని నమ్మిందా? అసలు శర్వా ఏమయ్యాడు? చివరికి విక్కీ, పార్వతి, జ్ఞానమూర్తిల కథ ఎలా ముగిసింది? అనేది ఈ ‘దొంగ’ స్టోరీ.