Nani on Bollywood Debut

Saturday,September 05,2020 - 12:06 by Z_CLU

* ఈ లాక్‌డౌన్‌ను జున్నుతో బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ట‌క్‌జ‌గ‌దీష్ కోసం 20 రోజులు రాజమండ్రిలో షూటింగ్ చేసిన‌ప్పుడు త‌న‌కు దూరంగా ఉంటే చిన్న బెంగ స్టార్ట్ అయ్యింది. అదే స‌మ‌యంలోనే పాండ‌మిక్ వ‌చ్చింది. నాకోస‌మే వ‌చ్చిందా? అనిపిస్తుంది. త‌న‌తో అంత బాగా టైమ్ స్పెండ్ చేస్తున్నాను.

* బాలీవుడ్‌లో సినిమా చేయాల‌నే కోరిక లేదు. నేను తెలుగువాడ్ని. ఇక్క‌డే సినిమాలు చేయాల‌నే అనుకుంటున్నాను.

* ప్యాన్ ఇండియా సినిమా చేయాల‌నే స్ట్రాట‌జీ ఏం వేసుకోలేదు. అయితే సినిమా చేయాల‌నిపిస్తే అప్పుడు ఆలోచిస్తాను.

* ట‌క్ జ‌గ‌దీష్ 50 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. అక్టోబ‌ర్ నుండి ఈ సినిమా మిగిలిన షూటింగ్‌ను చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా పూర్త‌యిన త‌ర్వాతే శ్యామ్‌సింగ‌రాయ్ స్టార్ట్ చేస్తాం.

* లాక్‌డౌన్ ముందే నేను 2020 ఎండ్ వ‌ర‌కు బిజీగా ఉన్నాను.. లాక్‌డౌన్ వ‌ల్ల అన్నీ పోస్ట్ పోన్ అయ్యాయి. దీంతో ఈ సినిమాలన్నీ 2021...2022 వ‌ర‌కు వెళ్లాయి.

* లాక్‌డౌన్ స‌మ‌యంలో రెండు సినిమాలు ఓకే చేశాను. అందులో ఒకటి డెబ్యూ డైరెక్ట‌ర్ మ‌రొక‌టి ఎస్టాబ్లిష్‌డ్ డైరెక్ట‌ర్‌తో చేయ‌బోతున్నాను.

* రాబోయే రోజుల్లో షూటింగ్స్‌, లొకేష‌న్స్ ఎలా ఉంటాయ‌నే దానిపై ఎవ‌రికీ అవ‌గాహ‌న లేదు. క‌రోనా వ్యాక్సిన్ రాలేదు. ప‌ని లేకుండా చాలా రోజులు ఇంట్లోనే వెయిట్ చేశాం. చాలా మందికి మ‌నం సాయం చేశాం కానీ.. అది శాశ్వ‌త ప‌రిష్కారం కాదు.. పని ఒక్క‌టే దారి. ఇండ‌స్ట్రీ దీనిపై ఓ నిర్ణ‌యం తీసుకోక‌పోతే ప‌నులు ముందుకు క‌ద‌ల‌వు. అంద‌రూ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుని వ‌ర్క్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది.