Kiara in Prabhas’s Adipurush

Saturday,September 05,2020 - 12:27 by Z_CLU

బాలీవుడ్ డైరెక్టర్ Om Raut తో Prabhas22 ఎనౌన్స్ అయిన సంగతి తెలిసిందే.. నాలుగు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో విలన్ గా లంకేష్ పాత్రలో Saif Ali Khan నటించనున్నాడని ప్రకటించారు మేకర్స్. అయితే ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్రభాస్ కి హీరోయిన్ ఎవరు కనిపించబోతున్నారు అనే ఆసక్తిగా మారింది. Adipurush లో హీరోయిన్ ఎవరా అని ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వానీ ని ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది. మొన్నటి వరకు ఈ సినిమాకు హీరోయిన్ గా కీర్తి సురేష్ ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు Kiara కే ఓటేసాడట ఓం రౌత్. త్వరలోనే మేకర్స్ కియరా ను హీరోయిన్ గా ప్రకటించనున్నారని సమాచారం. T Series నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది.