Panchakattu first single promo from Ante Sundaraniki out

Tuesday,April 05,2022 - 04:13 by Z_CLU

నేచురల్ స్టార్ నాని , వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'అంటే సుందరానికీ' సినిమా ఇటివలే షూటింగ్ ఫినిష్ చేసుకొని ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశారు మేకర్స్. ముందుగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. రేపు 'పంచకట్టు' అనే సింగిల్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసుకున్నారు.

ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది చెప్పేలా ప్రోమో రిలీజ్ చేసి హింట్ ఇచ్చారు. ఫర్ ది ఫస్ట్ టైం కర్ణాటిక్ సింగర్ పద్మ శ్రీ అరుణ సాయి రామ్ ఈ సినిమా కోసం ఓ సాంగ్ పాడబోతున్నారు. ఆ విషయాన్ని చెప్తూ ఆమె పాడుతున్న విజువల్స్ తో ప్రోమో వదిలారు.

వివేక్ ఆత్రేయ , వివేక్ సాగర్ కాంబోలో మంచి సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. ఈ  కాంబో నుండి వస్తున్న ఈ సాంగ్ పై మంచి ఎక్స్ పెక్టేషన్ ఉన్నాయి. రేపు ఫుల్ సాంగ్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ సాంగ్ ఏ రేంజ్ హిట్ అనిపించుకుంటుందో వేచి చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ యర్నేని , రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని సరసన నజ్రియా నజిమ్ హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో ఆమె నటిస్తున్న మొదటి సినిమా ఇది. జూన్ 10న సినిమా థియేటర్స్ లోకి రానుంది.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics