NagaShaurya's opinion on marriage
ఇండస్ట్రీలో చాలామంది హీరోలు పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. నిఖిల్, నితిన్, రానా లాంటి హీరోలు మ్యారీడ్ లైఫ్ లోకి ఎంటరైనప్పటికీ.. నాగశౌర్య లాంటి హీరోలు ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గానే కొనసాగుతున్నారు. మరి పెళ్లిపై శౌర్య అభిప్రాయం ఏంటి?
"కల్యాణం వచ్చినా.. కక్కు వచ్చినా ఆగదంటారు. నా పెళ్లి విషయంలో నాకు పెద్దగా ప్లాన్స్ ఏమీ లేవు. మనం ఎంత ప్లాన్ చేసిన పెళ్లి విషయంలో రాసి పెట్టిందే జరుగుతుంది. వచ్చిన భార్యను బాగా చూసుకోవాలి. తనకు ప్రైవసీ ఇవ్వాలి. ఆమె ఫ్రొషెషన్కు గౌరవం ఇవ్వాలి. ఫైనల్గా ఆ అమ్మాయిని బాగా చూసుకోవాలి అంతే!"
ఇలా పెళ్లిపై తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు శౌర్య. పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా, లవ్ మ్యారేజ్ అయినా రెండింటిలో లవ్ ఉంటుందంటున్నాడు శౌర్య. ఇక కెరీర్ పై స్పందిస్తూ.. తనకు ఇంకా 4 బ్లాక్ బస్టర్స్ కావాలని చెప్పుకొచ్చాడు.
"నాకు ఉన్న పెద్ద హిట్ ‘చలో’. ఇంకా నాలుగు కావాలి. ‘వరుడు కావలెను’ రెండోది పెద్ద హిట్. ‘అశ్వద్ధామ’ సక్సెస్ కాదు అంటే నేను ఒప్పుకోను. ‘నర్తనశాల’ వంటి ఫ్లాప్ సినిమా తర్వాత నాకు బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన సినిమా ‘అశ్వద్ధామ’. ఒకే రోజు ఎదగడం కంటే ఒక్కో మెట్టు ఎక్కడం మంచిదని నెమ్మదిగా వెళ్తున్నా."
ఈ హీరో నటించిన వరుడు కావలెను సినిమా ఈరోజు గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలున్నాయి. రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో లక్ష్మీసౌజన్య దర్శకురాలిగా పరిచయమౌతోంది.
- - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics