NagaShaurya's Varudu Kaavalenu gets Positive talk in Theaters
నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన సినిమా వరుడు కావలెను. ఎప్పుడైతే ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ రిలీజైందో అప్పట్నుంచే సినిమాపై అంచనాలు పెరిగాయి. దీనికితోడు సితార ఎంటర్ టైన్ మెంట్స్ లాంటి ప్రెస్టీజియస్ బ్యానర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, కచ్చితంగా బాగుంటుందనే ఇమేజ్ ఉంది. ఆ అంచనాల్ని పెర్ ఫెక్ట్ గా అందుకుంది వరుడు కావలెను సినిమా.
ఈరోజు వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఓవర్సీస్ లో ఈ సినిమా చూసిన ఆడియన్స్ ''క్లీన్ హిట్'' టాక్ ఇచ్చారు. సినిమా క్లాసీగా, కొత్తగా ఉందని అంటున్నారు. శౌర్య-రీతూ జంట ఆకట్టుకుందని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందంటున్నారు.
సినిమాకు భారీగా చేసిన ప్రచారం కలిసొచ్చింది. రానాతో ట్రయిలర్ లాంచ్ చేయించారు. సంగీత్ ఫంక్షన్ అంటూ చేసిన వేడుకకు పూజా హెగ్డేను తీసుకొచ్చారు. ఇక ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ఏకంగా అల్లు అర్జున్ ను చీఫ్ గెస్ట్ గా పెట్టారు. ఇలా భారీగా చేసిన ప్రమోషన్, వరుడు కావలెను సినిమాకు ప్లస్ అయింది. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగేలా చేసింది.
సినిమాలో ఆకాష్ పాత్రలో కనిపించాడు నాగశౌర్య. ఇక భూమిగా రీతూవర్మ నటించింది. వీళ్లిద్దరి మధ్య సాగే ప్రేమ ప్రయాణమే వరుడు కావలెను సినిమా. డైరక్టర్ లక్ష్మీసౌజన్య నాలుగేళ్లుగా పెట్టుకున్న నమ్మకం, ఈరోజు నిజమైందంటున్నారు సినీ ప్రేక్షకులు. ఫీల్ గుడ్ మూవీగా, చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా గుర్తింపు తెచ్చుకుంది ఈ సినిమా.
- - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics