Varudu Kaavalenu హీరో నాగ శౌర్య ఇంటర్వ్యూ !

Thursday,October 28,2021 - 04:20 by Z_CLU

నాగ శౌర్య , రీతు వర్మ జంటగా లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ వరుడు కావలెను‘  రేపే రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో నాగశౌర్య మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు శౌర్య మాటల్లోనే …

నాలుగేళ్ల క్రితం 

2018 లో ‘ఛలో’ రిలీజయ్యాక ఓ పార్టీ పెట్టుకున్నాను. ఆ రోజు ఎడిటర్ చంటి గారితో అక్కడికి వచ్చిన లక్ష్మి అక్క నన్ను కలిసి కంగ్రాట్స్ చెప్పి ఒక కథ చెప్తా వింటావా ? అని అడిగారు. సో విన్నాను నచ్చింది మొదలు పెట్టేశాం. సో అప్పటి నుండి ఈ సినిమాతో ట్రావెల్ అయ్యాను. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతోంది.

అమ్మాయి డైరెక్టర్ అయితే ఎడ్వాంటేజ్ అదే 

జెనరల్ గా అబ్బాయిలకంటే అమ్మాయిలకు ఓపిక ఎక్కువ ఉంటుంది. ఇక వాళ్ళు డైరెక్టర్ అయితే కోపాలు, అరవడాలు లాంటివి సెట్ లో కనిపించవు. పీస్ ఫుల్ గా వర్క్ జరిగిపోతుంటుంది. మా డైరెక్టర్ చాలా ఓపికతో కూల్ గా ఈ సినిమాను డైరెక్ట్ చేసింది.

nagashaurya

ఆ పాయింట్ ఇందులో చెప్పాం 

బేసిక్ గా ముప్పై ఏళ్ళు వచ్చే సరికి ఒక అబ్బాయికి గానీ అమ్మాయికి గానీ వాళ్ళ ఇంట్లో నుండి అలాగే రిలేటివ్స్ నుండి ఎక్కువగా పెళ్ళెప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది. అది కొన్ని సార్లు మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. వాళ్ళు అసలు పెళ్ళికి రెడీగా ఉన్నారా ? ఎవరితో అయినా ప్రేమలో ఉన్నారా ? లాంటివి ఏం ఆలోచించరు. ఆ పాయింట్ తో సినిమా అని చెప్పగానే వెంటనే ఒకే అనేశాను. ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఎవ్వరూ చూపించలేదు.  మేము చెప్పిన ఈ పాయింట్ కి అందరూ కనెక్ట్ అవుతారు.

ఫ్లాష్ బ్యాక్ హైలైట్ 

సినిమాలో ఓ పదిహేను నిమిషాల పాటు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. అదే మా సినిమాకు మెయిన్ USP. సినిమాలో వచ్చే ఆ ఎపిసోడ్ ఫ్రెష్ గా అనిపిస్తుంది. అందరికీ బాగా నచ్చుతుంది.

త్రివిక్రమ్ సీన్ లో నేను 

సినిమాలో త్రివిక్రమ్ గారు ఒక సీన్ రాశారు. ఐయాం గ్లాడ్. ఆయన రాసిన ఒక సీన్ లో ఆయన డైలాగ్స్ చెప్పడం నాకు చాలా హ్యాపీ మూమెంట్.

పెళ్ళిపీటల వరకూ జరిగే కథ 

‘వరుడు కావలెను’ పెళ్లిపీటల ముందు వరకూ జరిగే కథ. ఆ తర్వాత జరిగే కథ కాదు. అందుకే ఇది యూత్ కి అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కీ నచ్చేలా ఉంటుంది. ఆడవారికి ప్రేమని ఒప్పించే వరకూ ఉండే ప్రేమని అద్దం పట్టేలా ఉంటుంది.

మేమిద్దరం మళ్ళీ కలిసి చేస్తాం 

రీతు అందమైన అమ్మాయి తెలుగు మాట్లాడుతుంది. తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. డబ్బింగ్ చాలా  అందంగా చెప్పింది. తనతో నటించడం చాలా కంఫర్టబుల్. చాలా మంచి అమ్మాయి కూడా.  నాకు తెలిసి త్వరలోనే మేమిద్దరం ఇంకో సినిమా కూడా చేస్తామనుకుంటా.

బన్నీ అన్నకి థాంక్స్ 

నిన్న ఈవెంట్ కి వచ్చి బన్నీ అన్న నా గురించి చాలా మాట్లాడారు. ఈ సందర్భంగా బన్నీ అన్న కి థ్యాంక్స్ చెప్తున్నా. ఆయన నా గురించి మాట్లాడిన మాటలు విని ఇంకా ఎక్కువ కష్టపడాలి అనే స్ఫూర్తి నిచ్చింది.

varudu kavalenu nagashaurya ritu varma 2

పక్కా బ్లాక్ బస్టర్ 

స్క్రిప్ట్ విన్నప్పుడు మంచి సినిమా అవుతుంది అనిపించింది. షూటింగ్ లో అంతా బాగానే ఉందా ? అనే డౌట్ ఉండింది. ఎడిటింగ్ లో చూసినప్పుడు మనం అనుకున్న దానికంటే బాగా వస్తుందని అనిపించింది. ఫైనల్ అవుట్ పుట్ చూశాక ఇది పక్కా బ్లాక్ బస్టర్ అనిపించింది. సినిమా మీద కాన్ఫిడెంట్ లేకపోతే నాలో తెలిసిపోతుంది. నేను సినిమాలో మాత్రమే యాక్ట్ చేయగలను. బయట చేయలేను. సినిమా రిజల్ట్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. డెఫినేట్ గా మీ అందరికీ నచ్చుతుంది.

ఇంకా తెలియదు 

పెళ్ళెప్పుడు అనేది ఇంకా తెలియదు. వచ్చే సంవత్సరమా ? లేక ఇంకా టైం పడుతుందా ? అనేది చెప్పలేను. టైం వచ్చినప్పుడు అన్నీ అలా జరిగిపోతుంటాయి. పెళ్లి కూడా అంతే. కానీ నాకు ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేవు. లైఫ్ పార్టనర్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అనుకుంటున్నాను. అదొక్కటే మైండ్ లో ఉంది.

ఐదు బ్లాక్ బస్టర్స్ ఉండాలి 

ఏ హీరోకయినా హిట్స్ కంటే ఎక్కువ ఫ్లాప్స్ ఉంటాయి.  ఇది అందరికీ తెలిసిన సత్యం. ఒక పెద్ద స్టార్ అవ్వడానికి కరెక్ట్ గా ఐదు బ్లాక్ బస్టర్స్ చాలు. నాకు ఆల్రెడీ ఛలో ఒకటి ఉంది. ఇంకో నాలుగు కావాలి. ఇంకొకటి ‘వరుడు కావలెను’ తో అవ్వబోతుంది. ‘అశ్వథామ’ నా కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన సినిమా. నర్తనశాల అనే డిజాస్టర్ తర్వాత కూడా అంత మంచి ఓపెనింగ్స్ వచ్చాయంటే నాకది గొప్ప విషయమే. ఒకే రోజు ఎదగడం అని కాకుండా రోజు రోజుకి ఎదుగుతున్నాను.  ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్తున్నాను.

nagashaurya

నిర్ణయం నాదే 

సినిమా కథల ఎంపిక విషయంలో నిర్ణయం నాదే. అమ్మ ,  నాన్న, ఫ్రెండ్స్ ఎవరి సలహాలు తీసుకోను. సినిమా హిట్టయినా ఫ్లాప్ అయినా మన వాళ్ళే జరిగింది అనేది క్లియర్ కట్ గా ఉండాలనుకుంటాను. సో వారి సలహాలు తీసుకొని రిజల్ట్ తేడా వస్తే వారిని అనుకోలేను. అది నాకిష్టం ఉండదు.

అది నా డ్రీం ప్రాజెక్ట్ 

నెక్స్ట్ మూడు సినిమాలు చేస్తున్నాను. లక్ష్య నెక్స్ట్ మంత్ రిలీజ్. అనిష్ కృష్ణ తో నా సొంత బేనర్ లో చేస్తున్న సినిమా 90 % అయ్యింది. ఇక అవసరాల శ్రీనివాస్ గారితో ‘ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి’ సినిమా నా డ్రీం ప్రాజెక్ట్. ఆ సినిమా మొదలు పెట్టి నాలుగేళ్ళవుతోంది. అందులో ఏడు డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. అది నా కెరీర్ లో గుర్తుండి పోయే సినిమా అవుతుంది. ఇక ‘పోలీసు వారి హెచ్చరిక’ సినిమా మా నిర్మాత సడెన్ గా చనిపోవడం వలన ఆగింది. చూడాలి ఆ ప్రాజెక్ట్ ఏమవుతుందో మరి.  OTT నుండి ఆఫర్స్ వస్తున్నాయి. నన్ను నేను 70MM స్క్రీన్ మీద చూసుకోవడానికే ఇష్ట పడతాను. అందుకే ఆ ఆఫర్స్ ని రిజెక్ట్ చేశాను.

– Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics