ManiSharma back into the form with 10 movies

Monday,November 02,2020 - 12:01 by Z_CLU

సంగీతంలో స్వరబ్రహ్మ గా పేరొందిన మెలోడీ బ్రహ్మ Manisharma ఇప్పుడు 10 సినిమాలతో బిజీగా ఉన్నారు. అవును ISMART Shankar ఆల్బం సాధించిన సక్సెస్ తో మళ్ళీ పూర్వ వైభవం అందుకొని వరుసగా సినిమాలు చేస్తున్నారు మణి. మెగాస్టార్ సినిమా నుండి వెబ్ ఫిలిం వరకూ అన్నీ కలిపి మణిశర్మ చేతిలో పది సినిమాలున్నాయి. ఇది ఆషామాషీ కాదు. ఒకప్పటి సంగీత దర్శకుల్లో ఎవ్వరికీ సాధ్యం కానిది తన మ్యూజిక్ టాలెంట్ తో చేసి చూపిస్తున్నారు మణి.

ప్రస్తుతం యంగ్ జెనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్ కి గట్టి పోటీ ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాబోతున్నాడు మెలోడీ బ్రహ్మ. చిరంజీవి -కొరటాల కాంబినేషన్ లో వస్తున్న 'Acharya', వెంకటేష్ చేస్తున్న రీమేక్ సినిమా 'Naarappa', గుణ శేఖర్ Shakunthalam, గోపీచంద్ 'Seetimaar', రామ్ 'Red' సాయి ధరం తేజ్ -దేవకట్ట సినిమా, సుదీర్ బాబు 'Sridevi Soda Centre', నితిన్ Power Peta, Sharwanand Bilingual Cinema ఇలా వరుస సినిమాలకు మ్యూజిక్ ఇస్తున్న మణిశర్మ మరోవైపు 'BlackRose' , Pogarunnodu' వంటి చిన్న వెబ్ ఫిలిమ్స్ కూడా మ్యూజిక్ అందిస్తూ దూసుకుపోతున్నాడు. ఈ లెక్కన మణిశర్మ చేస్తున్న సినిమాల లిస్టు చూస్తుంటే మళ్ళీ కొన్నేళ్ళ పాటు సంగీత దర్శకుడిగా చక్రం తిప్పబోతున్నారని అర్థమవుతుంది. మరి ఈ సినిమాల ఆల్బమ్స్ తో మెలోడీ బ్రహ్మ ఎలాంటి హిట్స్ అందుకుంటాడో వేచిచూడాలి.