Sudeep in Pawan’s Ayyappanum Koshiyum Remake

Monday,November 02,2020 - 12:13 by Z_CLU

ఓ స్టార్ హీరో సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చిందంటే చాలు ఆ సినిమా చుట్టూ కొన్ని గాసిప్ట్స్ చక్కర్లు కొడుతుంటాయి. ఇప్పుడు సరిగ్గా PowerStar చేయబోతున్న రీమేక్ సినిమాపై కూడా అలాంటి రూమర్లే తిరుగుతున్నాయి. Pawan Kalyan తో Sagar K Chandra దర్శకత్వంలో సినిమా ప్రకటించింది Sithara entertainments సంస్థ. ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ Ayyappanum Koshiyum కి రీమేక్. దీంతో ఇప్పుడీ సినిమాలో పవన్ తో పాటు నటించే మరో హీరో ఎవరా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.

మొన్నటివరకూ ఈ సినిమాలో Rana Daggubati నటిస్తాడనే ప్రచారం జరిగింది. తాజాగా Nithin పేరు కూడా వినిపించింది. ఇక ఇప్పుడు కన్నడ హీరో Sudheep పేరు తెరపైకి వచ్చింది. ఈ రీమేక్ లో పవన్ తో కలిసి నటించేది సుదీప్ అంటూ గట్టిగా ప్రచారం జరుగుతుంది.

నిజానికి ఈ గాసిప్ ను తీసిపారేయలేం. రీసెంట్ గా పవన్ ను కలిశాడు సుదీప్. ఆ మీటింగ్ ఈ సినిమా కోసమే అనుకోవచ్చు కూడా. ఏదేమైనా పవన్ తో కలిసి నటించే మరో హీరో ఎవరనేది మేకర్స్ ఎనౌన్స్ చేసే వరకూ ఇలా రోజుకో హీరో పేరు చక్కర్లు కొడుతుంది. వీటికి చెక్ పెట్టాలంటే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సిందే.