Samantha’s ‘Shaakuntalam’ new release date out

Friday,February 10,2023 - 06:21 by Z_CLU

శకుంత‌లగా బ్యూటీఫుల్ హీరోయిన్ స‌మంత  ..దుష్యంత మ‌హారాజుగా దేవ్ మోహ‌న్ న‌టిస్తోన్న‌ పౌరాణిక ప్రేమ క‌థా సినిమా ‘శాకుంతలం’.  గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ ఎపిక్ ల‌వ్ స్టోరి ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది. సినిమా అనేది లార్జ‌ర్ దేన్ లైఫ్‌గా ఉండాలంటూ ప్ర‌తి ఫ్రేమ్‌ను అద్భుతంగా తెర‌కెక్కించే డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా 'శాకుంత‌లం'ను రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వ‌ర‌క క్రియేష‌న్స్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ భారీ సినిమాను నిర్మిస్తున్నారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.

విజువ‌ల్ వండ‌ర్‌గా త్రీడీ టెక్నాల‌జీతో తెలుగు, హిందీ, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో శాకుంత‌లం సినిమా విడుద‌ల‌వుతుంది. ఇప్ప‌టికే రిలీజైన ట్రైల‌ర్, ‘మల్లికా మల్లికా..’ సాంగ్ సోష‌ల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

శాకుంత‌లం సినిమాకు సాయి మాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు అందించారు. శేఖ‌ర్ వి.జోసెఫ్ సినిమాటోగ్ర‌ఫీ చేసిన ఈ చిత్రానికి ప్ర‌వీణ్ పూడి ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. డా.ఎం.మోహ‌న్ బాబు, ప్ర‌కాష్‌ రాజ్‌, మ‌ధుబాల‌, గౌత‌మి, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, జిస్సు సేన్ గుప్తా కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువ‌రాజు భ‌ర‌తుడి పాత్ర‌లో న‌టించ‌టం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ కానుంది.