Major update from Mahesh SarkaruVaari Paata

Friday,April 23,2021 - 04:27 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ కి కూడా ఓ సెంటిమెంట్ ఉంది. తన తండ్రి కృష్ణ జన్మదినం రోజు తన సినిమాకు సంబంధించి ఏదో ఒకటి రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంటాడు మహేష్. ప్రతీ ఏడాది మే31 న మహేష్ సినిమా అప్డేట్ పక్క అంటూ ఫ్యాన్స్ కూడా ఫిక్సయిపోతారు. ఈ ఏడాది కూడా అభిమానులకి ఓ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు మహేష్. అవును 'సర్కారు వారి పాట' సినిమాకు సంబంధించి ఓ టీజర్ ని రిలీజ్ చేసి సూపర్ స్టార్ కృష్ణ గారికి బర్త్ డే విషెస్ చెప్పనున్నారట మేకర్స్. మే 30 రాత్రికే మహేష్ స్టిల్ తో ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి మరుసటి రోజు టీజర్ వదిలే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.

ఇప్పటికే ఈ టీజర్ కి సంబంధించి వర్క్ జరుగుతుందని సమాచారం. టీజర్ లో ఓ యాక్షన్ ఎపిసోడ్ కట్ తో పాటు డైలాగ్ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఇటివలే దుబాయ్ లో భారీ షెడ్యుల్ పూర్తి చేసిన యూనిట్ తాజాగా హైదరబాద్ లో రెండో షెడ్యుల్ మొదలుపెట్టారు. కరోన వ్యాప్తి ఎక్కువగా ఉన్న కారణంగా బ్రేక్ తీసుకున్నారు. పరిస్థితులు కాస్త చక్కబడిన వెంటనే మళ్ళీ షూటింగ్ మొదలు పెడతారు. ఈ షెడ్యుల్ లో మహేష్ మిగతా నటీ నటులపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు.

  • Thaman-Shares-Update-About-Sarkaru-Vaari-Paata-songs

మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కొంత గ్యాప్ తర్వాత మహేష్ -తమన్ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఆల్బంపై మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే 'గీతగోవిందం' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పరశురాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై అటు మహేష్ అభిమానుల్లో ఇటు సినిమా ప్రేమికుల్లో భారీ ఎక్స్ పెక్టేషన్స్ నెలకొంటున్నాయి. మరి ఇప్పటి వరకు ప్రీ లుక్ పోస్టర్స్ తో ఆసక్తి రేకెత్తించిన మహేష్ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ తో ఎలాంటి అంచనాలు పెంచుతాడో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics