‘Miss Shetty Mr Polishetty’ Trailer Review

Monday,August 21,2023 - 06:35 by Z_CLU

నవీన్ పోలిశెట్టి , అనుష్క శెట్టి జంటగా తెరకెక్కిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సెప్టెంబర్ 7 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

 "ఇంజనీరింగ్ చేసి స్టాండప్ కామెడీ ఏంటి ? అంటూ అనుష్క అడగ్గా "అదే కదండీ ప్రాసెస్" అంటూ నవీన్ రిప్లై తో మొదలైన  2 నిమిషాల 30 సెకన్ల ట్రైలర్... సినిమాలో ఉండే కంటెంట్ తెలియజేస్తూ మంచి హైప్ క్రియేట్ చేసింది. ట్రైలర్ లో అనుష్క తనకి నచ్చిన అబ్బాయి కోసం వెతికే ప్రాసెస్ తో వచ్చే సీన్స్ , నవీన్ స్టాండప్ కామెడీ సీన్స్ హిలేరియస్ గా ఉన్నాయి. నువ్వు నిజంగా టాలెంటెడ్ సిద్దు అని చెప్పగానే వచ్చే "లేడీ లక్కు నువ్వే" సాంగ్ బిట్ ట్రైలర్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. "మీ సిస్టర్ ఆ ..? సిస్టర్... మీరు సిస్టర్ అయినంత మాత్రాన ప్రతీ అమ్మాయి సిస్టర్ కాదు కదా సిస్టర్" అంటూ నవీన్ డైలాగ్ ట్రైలర్ లో బాగా పేలింది. 

"పెళ్లి వద్దు కానీ ప్రెగ్నెంట్ అవ్వడానికి నా హెల్ప్ కావాలా ?" అంటూ సిద్దు ట్రైలర్ లో చెప్పే డైలాగ్ సినిమా కథ గురించి చెప్తుంది. ఇక ఫార్మాలిటీస్ స్టార్ట్ చేద్దామా ? అనే డైలాగ్ తర్వాత వచ్చే సీన్స్ కూడా హిలేరియస్ గా ఉన్నాయి. లాస్ట్ లో "సీసీటీవీ కెమెరా ఉందక్కడ! నాకేం ప్రోబ్లం లేదు ఏం మాట్లాడుతున్నావ్? వైరల్ అయిపోతాం" అనే డైలాగ్ తో ఎండయిన ట్రైలర్ సినిమా ప్రేక్షకులను హిలేరియస్ గా ఎంటర్టైన్ చేయడం ఖాయమని తెలియజేస్తుంది. ట్రైలర్ లో విజువల్స్ , మ్యూజిక్ హైలైట్ గా నిలిచాయి.

యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాకు మహేష్ బాబు దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 7న కృష్ణాష్టమి స్పెషల్ గా సినిమా థియేటర్స్ లోకి రానుంది.