Ranveer Singh in Ramcharan-Shankar Movie?

Friday,January 21,2022 - 03:35 by Z_CLU

శంకర్ డైరెక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలో బాలీవుడ్ హీరో నటిస్తున్నాడనే న్యూస్ హాట్ టాపిక్ అవుతుంది. అవును సినిమాలో రన్వీర్ సింగ్ రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నాడట. అయితే అది జస్ట్ క్యామియో అని సమాచారం. నెక్స్ట్ షెడ్యుల్ లో రన్వీర్ సింగ్ పై సన్నివేశాలు తీయనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి 2-3 షెడ్యుల్స్ జరిగాయి.

ఈ సినిమా తర్వాత రన్వీర్ సింగ్ తో హిందీ లో సినిమా చేయబోతున్నాడు శంకర్. విక్రమ్ తో తీసిన 'అపరిచితుడు' కి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమా అఫీషియల్ గా ఎనౌన్స్ అయింది. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. ఇటివలే రన్వీర్ తో అపరిచితుడు రీమేక్ స్క్రిప్ట్ డిస్కషన్స్ జరుగుతుండగా #RC15 లో స్పెషల్ రోల్ చేయాల్సిందిగా కోరాడట శంకర్. వెంటనే శంకర్ చెప్పిన క్యామియోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఒకే చెప్పేశాడట రన్వీర్. అందుకే హైదరాబాద్ లో జరిగిన సినిమా ఓపెనింగ్ కి కూడా గెస్ట్ గా విచ్చేశాడు రన్వీర్. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

దిల్ రాజు బేనర్ లో 50వ సినిమాగా నిర్మించబడుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్ , సునీల్ తో పాటు మిగతా నటీ నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్ సరసన కీయరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.