Keerthy Suresh replied Nithiin in funny way!

Tuesday,December 01,2020 - 05:09 by Z_CLU

ప్రస్తుతం ఈ హీరోహీరోయిన్లు ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారు. ఎంతో జాలీగా సెట్స్ లో ఉంటున్నారు. అంతలోనే Nithin పై ప్రతీకారం తీర్చుకుంటానంటూ ఏకంగా స్టేట్ మెంట్ ఇచ్చింది Keerthy Suresh.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. నితిన్-కీర్తిసురేష్ కలిసి RangDe సినిమా చేస్తున్నారు. ఫైనల్ షెడ్యూల్ కోసం దుబాయ్ వెళ్లారు. అక్కడ షూటింగ్ గ్యాప్ లో కీర్తిసురేష్ కాస్త రిలాక్స్ అయింది. సెట్స్ లోనే చిన్న కునుకు తీసింది.

ఆ టైమ్ లో కీర్తిసురేష్ ను ఫొటో తీశాడు నితిన్. "సెట్స్ లో పడుకునే అవకాశం ఎంతమందికి వస్తుంది" అంటూ చిన్న సెటైర్ కూడా వేశాడు. దీనిపై రీసెంట్ గా కీర్తిసురేష్ రియాక్ట్ అయింది.

Nithin-keerthysuresh-venkyatluri-on-sets

"షాట్ గ్యాప్ లో పడుకోకూడదని తెలుసుకున్నాను. నితిన్, వెంకీ అట్లూరి జెలస్ ఫీలవుతున్నారు. ఎలాగైనా రివెంజ్ తీర్చుకుంటాను" అంటూ రిప్లయ్ ఇచ్చింది. అయితే ఇదంతా సరదాగానే సాగింది. నితిన్-కీర్తి మధ్య ఆఫ్-స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బ్రహ్మాండంగా ఉందని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్ గా నిలిచింది.

గతంలో భీష్మ సినిమా టైమ్ లో కూడా రష్మికను ఇలానే ఆటపట్టించాడు నితిన్. ఇప్పుడు కీర్తిసురేష్ వంతు వచ్చింది.