Keerthy Suresh - నితిన్ పై పగ

Tuesday,December 01,2020 - 05:09 by Z_CLU

ప్రస్తుతం ఈ హీరోహీరోయిన్లు ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారు. ఎంతో జాలీగా సెట్స్ లో ఉంటున్నారు. అంతలోనే Nithin పై ప్రతీకారం తీర్చుకుంటానంటూ ఏకంగా స్టేట్ మెంట్ ఇచ్చింది Keerthy Suresh.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. నితిన్-కీర్తిసురేష్ కలిసి RangDe సినిమా చేస్తున్నారు. ఫైనల్ షెడ్యూల్ కోసం దుబాయ్ వెళ్లారు. అక్కడ షూటింగ్ గ్యాప్ లో కీర్తిసురేష్ కాస్త రిలాక్స్ అయింది. సెట్స్ లోనే చిన్న కునుకు తీసింది.

Nithin-keerthysuresh-venkyatluri-on-sets

ఆ టైమ్ లో కీర్తిసురేష్ ను ఫొటో తీశాడు నితిన్. “సెట్స్ లో పడుకునే అవకాశం ఎంతమందికి వస్తుంది” అంటూ చిన్న సెటైర్ కూడా వేశాడు. దీనిపై రీసెంట్ గా కీర్తిసురేష్ రియాక్ట్ అయింది.

“షాట్ గ్యాప్ లో పడుకోకూడదని తెలుసుకున్నాను. నితిన్, వెంకీ అట్లూరి జెలస్ ఫీలవుతున్నారు. ఎలాగైనా రివెంజ్ తీర్చుకుంటాను” అంటూ రిప్లయ్ ఇచ్చింది. అయితే ఇదంతా సరదాగానే సాగింది. నితిన్-కీర్తి మధ్య ఆఫ్-స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బ్రహ్మాండంగా ఉందని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్ గా నిలిచింది.

గతంలో భీష్మ సినిమా టైమ్ లో కూడా రష్మికను ఇలానే ఆటపట్టించాడు నితిన్. ఇప్పుడు కీర్తిసురేష్ వంతు వచ్చింది.

 

Also Check దుబాయ్ లో ‘రంగ్ దే’