Chaavu Kaburu Challaga Trailer released
Sunday,March 07,2021 - 11:00 by Z_CLU
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో వరస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారు పేరుగా నిలిచిన బన్నీ వాసు నిర్మాతగా ఎనర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్న చిత్రం 'చావు కబురు చల్లగా'. తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది.
అదిరిపోయే కామెడీ సీన్స్.. అద్భుతమైన ఎమోషన్.. మంచి కథతో అన్ని కమర్షియల్ హంగులు అద్దుకున్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే విడుదలైన టైటిల్, హీరో కార్తికేయ 'బస్తి బాలరాజు' ఫస్ట్ లుక్, ఇంట్రోతో పాటు క్యారెక్టర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి, టీజర్ గ్లిమ్ప్స్ కి, మైనేమ్ ఈజ్ రాజు, కదిలే కాలాన్ని, పైన పటారం లోన లొటారం పాటలకు అనూహ్య స్పందన లభించింది. తాజాగా ట్రైలర్ కూడా అదే రకంగా ఆకట్టుకుంటుంది.
ముఖ్యంగా ఇందులో కార్తికేయ గెటప్, డైలాగ్ డెలివరికి మంచి రెస్పాన్స్ వస్తుంది. చావు కబురు చల్లగా చిత్రాన్ని మార్చి 19న భారీ స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాత బన్నీ వాసు సన్నాహాలు చేస్తున్నారు.