Weekend Release – 3 movies

Wednesday,March 17,2021 - 01:26 by Z_CLU

ఈ వీకెండ్ ముచ్చటగా 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటి డీటెయిల్స్ చెక్ చేద్దాం

మంచు విష్ణు, కాజల్ కలిసి నటించిన సినిమా మోసగాళ్లు. ఇందులో వీళ్లు హీరోహీరోయిన్లు కాదు. మంచు విష్ణుకు అక్కగా కాజల్ నటించింది. అమెరికాలో జరిగిన బిగ్గెస్ట్ ఆన్ లైన్ స్కామ్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగు-ఇంగ్లిష్ లో సైమల్టేనియస్ గా తీశారు. సౌత్ లోని అన్ని భాషల్లో డబ్ చేసి ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. నవదీప్, నవీన్ చంద్ర, సునీల్ శెట్టి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

శుక్రవారం థియేటర్లలోకి మరో డిఫరెంట్ మూవీ చావుకబురు చల్లగా. ఇలాంటి కథ ఇప్పటివరకు తెలుగుతెరపై రాలేదు. ఇందులో హీరో మార్చురీ వ్యాన్ డ్రైవర్. హీరోయిన్ ఓ నర్సు. పైగా భర్త చనిపోతాడు. హీరో తల్లి ఆమని ఇంట్లోనే మందు కొడుతుంది. ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ తో కాస్త ఫన్, ఇంకాస్త ఎమోషన్ తో తెరకెక్కింది చావుకబురు చల్లగా.

వీకెండ్ ఎట్రాక్షన్ గా వస్తున్న మూడో సినిమా శశి. ఆది సాయికుమార్, సురభి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మంచి బజ్ వచ్చింది. దీనికి కారణం సిద్ శ్రీరామ్ పాడిన పాట సూపర్ హిట్ అవ్వడమే. దీనికితోడు ట్రయిలర్ కూడా క్లిక్ అయింది.

19వ తేదీన థియేటర్లలోకి రాబోతున్న ఈ 3 సినిమాల్లో ఏది జాతిరత్నాలు హవాను అడ్డుకుంటుందో చూడాలి.