Chavu Kaburu Challaga 1st Day Collection

Saturday,March 20,2021 - 03:07 by Z_CLU

కార్తికేయ-లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా చావు కబురు చల్లగా. ఓ మోస్తరు అంచనాల మధ్య నిన్న రిలీజైన ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కోటి 58 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

టైటిల్ తో పాటు సినిమా ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడం, అనసూయ ఐటెంసాంగ్ హిట్టవ్వడంతో చావుకబురు చల్లగా సినిమాపై అంచనాలు పెరిగాయి. దీంతోపాటు చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్లు దొరికాయి. అందుకే ఈ ఓపెనింగ్స్.

అయితే ఫస్ట్ డే ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఈరోజు, రేపు కలెక్షన్ కు ఢోకా ఉండదు. సోమవారం నుంచి ఈ సినిమా రన్ ఎలా ఉంటుందనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్.

ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్స్ నైజాం - 61 లక్షలు సీడెడ్ - 28 లక్షలు ఉత్తరాంధ్ర - 20 లక్షలు ఈస్ట్ - 12 లక్షలు వెస్ట్ - 7 లక్షలు గుంటూరు - 11 లక్షలు కృష్ణా - 12 లక్షలు నెల్లూరు - 7 లక్షలు