BA Raju Birthday Special

Thursday,January 07,2021 - 11:52 by Z_CLU

తెలుగు సినిమా చరిత్ర గురించి మాట్లాడుకుంటే అందులో చాలా మంది టెక్నీషియన్స్ ఉంటారు. వాళ్ళ ప్రస్తావన లేకుండా తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవడం వృధా అవుతుంది. ఆ లిస్టులో ప్రముఖ సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ , నిర్మాత BA RAJU ఒకరు. అవును తెలుగు సినిమాతో ఎన్నో ఏళ్లుగా పెనవేసుకొని ముందుకు సాగుతున్న వ్యక్తి ఆయన. ఒక అభిమాని స్థాయి నుండి జర్నలిస్ట్ గా మారి పిఆర్ఓ గా ఎదిగి సూపర్ హిట్ అనే పాపులర్ పత్రికను నడుపుతూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ చివరికి నిర్మాత స్థాయికి చేరుకున్న ఆయన ప్రయాణం అందరికీ ఆదర్శమే.

దాదాపు వేయి సినిమాలకు పైగా పీ.ఆర్.ఓ గా పనిచేసిన బి.ఎ.రాజు rj cinemas అనే సంస్థను స్థాపించి పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. ఈ బ్యానర్ లో రాజు నిర్మాతగా బి.జయ దర్శకత్వం వహించిన 'లవ్లీ' సూపర్ డూపర్ హిట్ గా నిలిచి నిర్మాతగా రాజు కి మంచి గుర్తింపు అందించింది. పాత్రికేయ వృత్తిలో ఇన్నేళ్ళుగా రాణిస్తున్న రాజు ఇప్పటికీ రోజుకో ఆర్టికల్ రాయకుండా ఉండలేరు. సినిమా అంటే ఆయనకి వల్లమానిన ప్రేమ, అభిమానం. సినిమా తప్ప మరో ప్రపంచం తెలియని వ్యక్తి రాజు.

ప్రస్తుతం నిర్మాతగా కొంత బ్రేక్ తీసుకున్న BA Raju త్వరలోనే ఆయన తనయుడితో ఓ సినిమా నిర్మించడానికి సిద్దం అవుతున్నారు. నిర్మాతగా ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తోంది జీ సినిమాలు. Happy Birthday BARaju.