Maruthi, Gopichand Combination fix

Thursday,January 07,2021 - 12:25 by Z_CLU

గతేడాది 'ప్రతిరోజు పండగే' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు మారుతి (Maruthi) నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తాడా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. తాజాగా తన తదుపరి సినిమాను కొత్త తరహాలో ఎనౌన్స్ చేసి అందరికీ క్లారిటీ ఇచ్చాడు మారుతి. మ్యచో హీరో గోపీచంద్ (Gopichand) తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు.

మొన్నటి వరకు మారుతి రవితేజ , నాని లతో సినిమా చేస్తాడనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని తన ఎనౌన్స్ మెంట్ కోసం వాడుకొని సరదాగా కోర్టు జడ్జిమెంట్ రూపంలో రావు రమేష్ వాయిస్ ఓవర్ తో కూడిన ఓ వీడియోతో సినిమాను ప్రకటించాడు మారుతి.

గీతా ఆర్ట్స్ 2 , యూ.వి.క్రియేషన్స్ ఈ కాంబినేషన్ సినిమాను నిర్మించనున్నాయి. గోపీచంద్ తో చేయబోయే సినిమా దర్శకుడిగా మారుతి కి 10వ సినిమా అవుతుంది. మరి యాక్షన్ హీరో గోపీచంద్ తో ఈ దర్శకుడు తెరకెక్కించే #Maruthi10 ఎలాంటి కథతో తెరకెక్కనుందో చూడాలి.

ఈ సినిమాలో గోపీచంద్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడనే టాక్ నడుస్తోంది.