Another Casting Call from Prabhas

Wednesday,February 10,2021 - 02:11 by Z_CLU

ప్రభాస్ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ ను ఇప్పటికే ఓసారి అందించాడు ఈ హీరో. ఇప్పుడు మరోసారి ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం అందుబాటులోకి వచ్చింది.

ప్రభాస్ సినిమాకు 9-14 ఏళ్ల మధ్య వయసున్న జమ్నాస్టిక్స్ అమ్మాయిలు, 20-30 ఏళ్ల మధ్య వయసున్న మార్షల్ ఆర్ట్స్ తెలిసిన అబ్బాయిలు కావాలంటూ నాగ్ అశ్విన్ ఎనౌన్స్ మెంట్ ఇచ్చాడు.

ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఇలా కాస్టింగ్ కాల్ రావడం ఇది వరుసగా రెండోసారి. ఇంతకుముందు సలార్ సినిమా కోసం కాస్టింగ్ కాల్ వెలువడింది. అందులో సెలక్ట్ అయిన నటీనటులతో ఆల్రెడీ షూటింగ్ కూడా ప్రారంభమైంది.

ఇప్పుడు నాగ్ అశ్విన్ సినిమా కోసం కూడా కొత్త నటీనటులు కావాలంటూ ప్రకటన వచ్చేసింది. అన్నీ అనకున్నట్టు జరిగితే ఈనెల 26న ఈ సినిమా అఫీషియల్ గా లాంచ్ అవుతుంది. మిక్కీ జే మేయర్ ఈ ప్రాజెక్టుకు మ్యూజిక్ డైరక్టర్. దీపిక పదుకోన్ హీరోయిన్.