Countdown begins for Prabhas’s ‘Salaar’ Release

Wednesday,June 21,2023 - 12:31 by Z_CLU

మిర్చి తర్వాత పక్కా మాస్ కమర్షియల్ సినిమా చేయలేదు ప్రభాస్. బాహుబలి , బాహుబలి 2 తర్వాత సాహో అంటూ స్టైలిష్ యాక్షన్ మూవీ చేశాడు. ఆ తర్వాత రాధేశ్యామ్ అనే లవ్ స్టోరీ , ఆదిపురుష్ అనే  డీవోషనల్ మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాహుబలి ఫ్రాంచైజ్ తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన ఏ సినిమా అభిమానులను పూర్తి స్థాయిలో సంతోష పరచలేదు. దీంతో ప్రభాస్ నెక్స్ట్ సినిమా సలార్ పై భారీ ఆశలు పెట్టుకుంటూ మరో వంద రోజుల్లో సినిమా అంటూ కౌంట్ డౌన్ మొదలు పెట్టేశారు.

ప్రభాస్ , ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ పై ప్రభాస్ ఫ్యాన్స్ కే  కాదు మూవీ లవర్స్ కి కూడా భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. కేజీఫ్ ఫ్రాంచైజ్ తర్వాత ప్రశాంత్ డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా అనేసరికి ఈ పాన్ ఇండియా మూవీపై వరల్డ్ వైడ్ గా హైప్ వచ్చేసింది. మిర్చి తర్వాత మాస్ కంటెంట్ తో ప్రభాస్ చేస్తున్న సినిమా కావడం, ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ ఇలా అన్నీ ఊహించుకుంటూ ఇప్పటి నుండే సలార్ హంగామా మొదలెట్టేశారు ఫ్యాన్స్.

హోంబలే ఫిలింస్‌ బేనర్ పై విజయ్ నిర్మిస్తున్న సలార్ సెప్టెంబర్ 28 న థియేటర్స్ లోకి రానుంది. సలార్ తో ప్రభాస్ ఓ రేంజ్ హిట్ అందుకోవడం, మాస్ కంటెంట్ తో ఫ్యాన్స్ ను మునపటిలా ఎంటర్టైన్ చేసి వారిను పూర్తిగా సంతృప్తి పరచడం ఖాయమనిపిస్తుంది.