Allu Arjun recovers from Corona

Wednesday,May 12,2021 - 02:43 by Z_CLU

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కరోనా నుంచి కోలుకున్నాడు. క్వారంటైన్ నుంచి బయటకొచ్చాడు. తను వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నట్టు ప్రకటించాడు బన్నీ.

allu-arjun-corona1

15 రోజుల క్వారంటైన్ తర్వాత తన రూమ్ నుంచి బయటకొచ్చాడు బన్నీ. ఆప్యాయంగా తన పిల్లల్ని కౌగిలించుకున్నాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

[video width="540" height="540" mp4="http://admin.zeecinemalu.com/wp-content/uploads/2021/05/allu-arjun-corona.mp4"][/video]

ఇవాల్టి నుంచి మొదలైన లాక్ డౌన్ వల్ల తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టొచ్చంటున్నాడు బన్నీ. తన కోసం ప్రార్థించిన అందరికీ థ్యాంక్స్ చెప్పాడు.

ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లోనే బన్నీకి కరోనా ఎఫెక్ట్ అయింది. దీంతో షూటింగ్ ఆగిపోయింది.

allu arju pushpa movie zeecinemalu

లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే మళ్లీ పుష్ప షూట్ లో జాయిన్ అవుతాడు అల్లు అర్జున్. బాహుబలి టైపులో 2 భాగాలుగా వస్తున్న ఈ సినిమాలో, మొదటి భాగాన్ని అక్టోబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics