Sai Pallavi in Bellamkonda Srinivas’s Chatrapathi

Wednesday,May 12,2021 - 05:47 by Z_CLU

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో 'ఛత్రపతి' సినిమా హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటివలే ఎనౌన్స్ ఆయన ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటికొచ్చింది. సినిమాలో శ్రీనివాస్ సరసన హీరోయిన్ గా సాయిపల్లవిని తీసుకొనున్నారనేది ఆ అప్ డేట్.

ఇటివలే సాయి పల్లవి ని సంప్రదించి ప్రాజెక్ట్ గురించి చెప్పారట. అయితే సాయి పల్లవి నుండి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో వరుసగా సినిమాలున్నాయి. ఒక వేళ డేట్స్ అడ్జెస్ట్ చేసి ఈ సినిమా ఒప్పుకుంటే మలయాళం , తెలుగు, తమిళ్ భాషల్లో హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న సాయి పల్లవి కి ఇది హిందీ లో డెబ్యూ సినిమా కానుంది.

love story movie sai pallavi zeecinemalu

ఇక సినిమాలో కీలకమైన అమ్మ పాత్రకు ఓ సీనియర్ నటిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. అలాగే స్పెషల్ సాంగ్ ను బాలీవుడ్ నుండి ఓ హీరోయిన్ తో చేయించాలని భావిస్తున్నారట. అలాగే స్ట్రాంగ్ విలన్ పాత్రకు బాలీవుడ్ నటుడిని ఫైనల్ చేశారని తెలుస్తుంది. త్వరలోనే హైదరాబాద్ లో మొదటి షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు. దీని కోసం ఓ భారీ సెట్ రెడీ అవుతుంది. ముందుగా స్లం ఏరియా సెట్ వేసి యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడట వినాయక్

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి కాస్ట్ అండ్ క్రూ ని ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు వినాయక్. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన 'ఛత్రపతి' ఎంతటి విజయం అందుకుందో తెలిసిందే. సినిమాలో యాక్షన్ తో పాటు సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవ్వడంతో సినిమా మంచి వసూళ్ళు రాబట్టింది. ఇక హిందీలో ఈ సినిమాను వినాయక్ తన స్టైల్ లో ఎలా తీస్తాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics