Movie Review – Vivaha Bhojanambu

Friday,August 27,2021 - 07:01 by Z_CLU

నటీనటులు: సత్య, ఆర్జీవి రాజ్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, సుబ్బరాయ శర్మ, టీఎన్ఆర్, వైవా హర్ష, శివన్నారాయణ, మధు మణి, నిత్య శ్రీ, కిరీటి, దయ, కల్ప లత తదితరులు

సంగీతం : అనివీ

సినిమాటోగ్రఫీ : మణికందన్

ఎడిటింగ్ : ఛోటా కె ప్రసాద్

ఆర్ట్ డైరెక్టర్ : బ్రహ్మ కడలి

కొరియోగ్రఫీ : సతీష్, విజయ్

కథ : భాను భోగవరపు

మాటలు : నందు ఆర్ కె

సాహిత్యం : కిట్టు, కృష్ణ చైతన్య

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సీతారాం, శివ చెర్రి

నిర్మాతలు : కేఎస్ శినీష్, సందీప్ కిషన్

దర్శకత్వం : రామ్ అబ్బరాజు

ఎన్నడూ ఊహించని ఓ వైరస్ కరోన రూపంలో ప్రపంచాన్ని కదిలించింది. ఆ సమయంలో ప్రధాని మోడి సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించాక సామాన్యులు పడిన కష్టాలు, ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ ఇన్సిడెంట్స్ తో ఎంటర్టైనింగ్ గా తీసిన సినిమానే 'వివాహ భోజనంబు'. కమెడియన్ సత్య హీరోగా నటించిన ఈ సినిమా మంచి వినోదం అందించింది. కాకపోతే అది మొదటి భాగానికే పరిమితమై రెండో భాగంలో కాస్త బోర్ కొట్టించింది. ఒక పిసినారి తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకోవాలనుకోవడం, ప్రేమించిన అమ్మాయి కుటుంబం చాలా పెద్ద కుటుంబం అవ్వడం, పెళ్లి తర్వాత లాక్ డౌన్ వల్ల వారందరూ పెళ్లి కొడుకు ఇంట్లోనే ఉండిపోవడం.... దాంతో వారిని పోషించడానికి ఆ పిసినారి పడే ఇబ్బందులతో భాను రాసిన కథతో దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను తెరకెక్కించాడు.

లాక్ డౌన్ లో జరిగిన ఓ పెళ్ళికి వచ్చినవారందరూ పెళ్లి కొడుకు ఇంట్లో ఉండిపోవడం అప్పట్లో వార్తల్లో వచ్చింది. ఆ న్యూస్ చూసి అందరు నవ్వుకున్నారు. దాన్నే కథగా మలిచి దానికి ఎమోషన్ యాడ్ చేసి ఈ సినిమా చేశారు. లాక్ డౌన్ లో సామాన్యుడు పడిన కష్టాన్ని నవ్విస్తూ చెప్పిన దర్శకుడు కరోన సోకినా వారి బాధని కూడా కామెడీగా చూపించాడు. అవన్నీ వార్తల్లో వచ్చినవే కాబట్టి ఎక్కువగా కనెక్ట్ అవుతారు ఆడియన్స్.

Vivaha_Bhojanambu_movie_satya-zeecinemalu

అయితే ఈ పాయింట్ తో సినిమా తీయడానికి టీం చాలానే కష్టపడ్డారు. అందుకే సగం వరకు ఎంటర్టైనింగ్ గా చూపిస్తూ ఆ తర్వాత సందీప్ కిషన్ ట్రాక్, అతికినట్టుగా అనిపించే ఎమోషన్స్ తో సినిమాను నడిపించారు. సందీప్ కిషన్ ట్రాక్ నుండి సినిమా గాడి తప్పింది. ఆ ట్రాక్ నవ్వు తెప్పించక పోగా విసుగు తెప్పించేలా ఉంది. ఆ పాత్రను సందీప్ ఏరి కోరి చేయడం ఏమిటో అనిపిస్తుంది. సగం సినిమా వరకూ కచ్చితంగా హిలేరియస్ గా నవ్విస్తుంది. అక్కడి నుండే ఇబ్బంది పెడుతూ బోర్ కొట్టేలా చేస్తుంది. సెకండాఫ్ ని కూడా ఎంటర్టైనింగ్ గా ప్లాన్ చేసుకుంటే బెటర్ గా ఉండేది.

సత్య తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. తన టైమింగ్ తో మహేష్ గా అలరించాడు. కథకి సరిగ్గా సరిపోయాడు కూడా. ఇకపై ఇలాంటి కథలతో సత్య సినిమాలు చేస్తే కామెడీ హీరోగా క్లిక్ అయ్యే అవకాశం ఉంది. కొత్తమ్మాయి అయినప్పటికీ అర్జీవి రాజ్ తన నటనతో మెప్పించింది. ఇక సత్య తర్వాత శ్రీకాంత్ అయ్యంగర్ క్యారెక్టర్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. సత్య , శ్రీకాంత్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించాయి. సుదర్శన్, శివన్నారాయణ డైలాగ్ కామెడీ వర్కౌట్ అయింది. మిగతా అందరు తమ పాత్రలకు న్యాయం చేశారు.అనివీ సంగీతం, మనికందన్ కెమెరా వర్క్ బాగున్నాయి. ఎడిటర్ చోటా కె ప్రసాద్ సినిమాను పర్ఫెక్ట్ గా కట్ చేశాడు.

ఫైనల్ కమెడియన్ సత్య హీరోగా సందీప్ కిషన్ నిర్మించిన లాక్ డౌన్ బేస్డ్ కామెడీ ఎంటర్టైనర్ 'వివాహ భోజనంబు' కాసిన్ని నవ్వులతో అలరించింది కానీ పూర్తి స్థాయిలో మెప్పించలేదు.

రేటింగ్ : 2.25/5

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics