Movie Review – Ichata Vahanamulu Niluparadu

Friday,August 27,2021 - 04:43 by Z_CLU

న‌టీన‌టులు: సుశాంత్‌, మీనాక్షి చౌద‌రి, వెంక‌ట్‌, వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి, అభిన‌వ్ గోమ‌టం, ఐశ్వ‌ర్య‌, నిఖిల్ కైలాస‌, కృష్ణ‌చైత‌న్య త‌దితరులు ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.ద‌ర్శ‌న్‌ నిర్మాత‌లు: ర‌వి శంక‌ర్ శాస్త్రి, ఎక్తా శాస్త్రి, హ‌రీశ్ కోయ‌ల‌గుండ్ల‌ నిర్మాణ సంస్థ‌లు: ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్‌ సినిమాటోగ్ర‌ఫీ: ఎం.సుకుమార్‌ మ్యూజిక్‌: ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు ఎడిట‌ర్‌: గ్యారీ బి.హెచ్‌ డైలాగ్స్‌: సురేశ్ భాస్క‌ర్‌ రన్ టైమ్: 2 గంటల 31 నిమిషాలు సెన్సార్: U/A రిలీజ్ డేట్: ఆగస్ట్ 27, 2021

సుశాంత్ సినిమాలపై ఎప్పుడూ ఇంత బజ్ లేదు. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాపై మాత్రం కొంచెం గట్టిగానే బజ్ నడిచింది. మరి ఆ ఎక్స్ పెక్టేషన్స్ ను ఈ అక్కినేని హీరో అందుకున్నాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

Ichata Vahanamulu Niluparadu sushanth

కథ

అరుణ్ (సుశాంత్) ఆర్కిటెక్ట్ గా పనిచేస్తుంటాడు. అదే ఆఫీస్ లో ఇంటర్న్ గా జాయిన్ అవుతుంది మీనాక్షి (మీనాక్షి చౌదరి). ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే అరుణ్ కు బైక్ డ్రైవింగ్ రాదు. స్వయంగా మీనాక్షి అతడికి బైక్ నేర్పిస్తుంది. లాంగ్ డ్రైవ్ కు తీసుకెళ్తే మనసులో మాట చెబుతానంటుంది. దీంతో అరుణ్ ఓ కొత్త బండి కొంటాడు.

మరోవైపు ఓ కాలనీ. అక్కడ నిత్యం దొంగతనాలు జరుగుతుంటాయి. ఆ కాలనీకి కింగ్ నర్సింహ్ యాదవ్ (వెంకట్). ఇదే కాలనీలో హీరోయిన్ ఉంటుంది. ఈ నర్సింగ్ యాదవ్ చెల్లెలే హీరోయిన్. ఓసారి అరుణ్ ను, మీనాక్షి ఇంటికి రమ్మంటుంది. బైక్ పై మీనాక్షి ఇంటికి వెళ్లిన అరుణ్, ఈ క్రమంలో కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడు.

మీనాక్షి కాలనీలో హత్య జరుగుతుంది. ఆ హత్య చేసింది అరుణ్ అని నర్సింగ్ తో పాటు అంతా అనుకుంటారు. ఈ గొడవల్లో బైక్ కూడా ధ్వంసం అవుతుంది. అసలు ఈ హత్య ఎవరు చేశారు? తనకు తెలియకుండా ఇరుక్కుపోయిన ఈ హత్య నుంచి అరుణ్ ఎలా బయటపడ్డాడు అనేది ఈ సినిమా స్టోరీ.

నటీనటుల పనితీరు

అరుణ్ గా సుశాంత్ నటన, స్టయిల్ బాగుంది. ఎందుకో అతడు కొత్తగా కనిపించాడు. చూడ్డానికే కాదు, యాక్టింగ్ లో కూడా. ఇక మీనాక్షి తన గ్లామర్ తో కట్టిపడేసింది. యాక్టింగ్ గురించి చెప్పుకోడానికేం లేదు. యాదవ్ గా వెంకట్ చాన్నాళ్ల తర్వాత కనిపించి ఆకట్టుకున్నాడు. వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నీషియన్స్ పనితీరు 

సినిమాలో టెక్నికల్ గా చెప్పుకోడానికేం లేదు. గ్యారీ బీహెచ్ సంగీతం, నేపథ్య సంగీతం ఏమంతగా కలిసి రాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్లక్ష్యంగా చేసిన చిన్న తప్పుల వల్ల ఇన్ని సమస్యలు వచ్చాయని సుశాంత్ చెప్పే డైలాగ్‌లు బాగుంటాయి. దర్శకుడు దర్శన్ మాత్రం తాను అనుకున్న పాయింట్‌ను సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయాడనిపిస్తుంది. స్క్రీన్ ప్లేలో ఫ్లో మిస్ అయింది. ఎడిటింగ్ లో మరింత దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు ఓకే.

Prabhas released Ichata vahanamulu Niluparadu teaser

జీ సినిమాలు రివ్యూ

నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించానని దర్శకుడు దర్శన్ చెప్పుకున్నాడు. అలాంటప్పుడు ఈ సినిమాను అంతే రియలిస్టిక్ గా తీసి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. సీరియస్ కథకు కామెడీ కోటింగ్ ఇచ్చి కాస్త ఎంటర్ టైనింగ్ గా చెప్పే ప్రయత్నంలో దర్శకుడు తడబడ్డాడు. మంచి పాయింట్ ఉన్నప్పటికీ, బిట్లు బిట్లుగా సినిమా ఆకట్టుకున్నప్పటికీ ఓవరాల్ గా ఎందుకో ఈ సినిమా మెప్పించదు.

కొన్ని కథలు పాయింట్ గా చెప్పినప్పుడు బాగానే అనిపిస్తాయి, కానీ ఎగ్జిక్యూషన్ కు వచ్చేసరికి మాత్రం తేడా కొట్టేస్తుంది. రెండున్నర గంటల పాటు కట్టిపడేసేలా సీన్లు రాయడం కష్టం అయిపోతుంది. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాకు అదే సమస్యగా మారింది. సీరియస్ గా కథనం సాగాల్సిన చోట సిల్లీగా, కామెడీ పండించే స్కోప్ ఉన్నచోట సీరియస్ గా కథ సాగుతుంది. దీంతో వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అభినవ్ లాంటి నటులు ఉన్నప్పటికీ ఫలితం మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో రాలేదు.

సినిమా స్టార్ట్ అవ్వడమే కాస్త డిఫరెంట్ గా స్టార్ట్ అవుతుంది. ఇదేదో కొత్తగా ఉందని అనుకునేలోపే వరుసపెట్టి రొటీన్ సీన్స్ వచ్చేస్తుంటాయి. అసలు కథ ఏంటి అని ఆలోచించేలోపు ఇంటర్వెల్ కు వచ్చేస్తాం. అప్పుడుకానీ కథ ఏంటి, పాయింట్ ఏంటనేది అర్థం కాదు.

పోనీ సెకండాఫ్ నుంచైనా కథ ఊపందుకుంటుందనుకుంటే అది కూడా లేదు. సీరియస్ గా కథలో లీనం అవ్వాలో, లేక కామెడీని ఎంజాయ్ చేయాలో మనకు అర్థంకాదు. కనీసం కామెడీ అయినా హిలేరియస్ గా ఉంటే కవర్ అయిపోయేది. పించ్ హిట్టర్ లా వచ్చిన సునీల్ కూడా తేలిపోయాడు. క్లైమాక్స్ కు వచ్చేసరికి ఓకే అనిపించినప్పటికీ అప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక ఈ సినిమాకు ఇచ్చట వాహనములు నిలపరాదు అనే టైటిల్ ఎందుకు పెట్టారనేది కూడా సందేహంగానే ఉండిపోతుంది. 2-3 సీన్లు చూపించి, టైటిల్ జస్టిఫికేషన్ అనేశారు తప్ప, ఈ కథకు టైటిల్ కు పెద్దగా సింక్ అవ్వదు.

ఉన్నంతలో సుశాంత్ ఆకట్టుకున్నాడు. అతడి లుక్ లో, నటనలో ఫ్రెష్ నెస్ కనిపించింది. కొత్తమ్మాయి మీనాక్షి చౌదరి గ్లామరస్ గా ఉంది. మిగతా నటీనటులంతా తమ పరిధి మేరకు నటించారు. టెక్నికల్ గా సినిమాలో చెప్పుకోడానికేం లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ బాగాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే దారుణం.

ఓవరాల్ గా చెప్పాలంటే సినిమాలో సుశాంత్ చెప్పినట్టు, ఇది నిర్లక్ష్యంగా చేసిన చిన్న తప్పు.

రేటింగ్: 2.5/5

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics