ZeeCinemalu - May 28

Thursday,May 27,2021 - 09:53 by Z_CLU

Dora-zeecinemalu

డోర
నటీనటులు : నయనతార, తంబి రామయ్య
ఇతర నటీనటులు : హరీష్ ఉత్తమన్, షాన్, సులీల్ కుమార్, బేబీ యుక్త
మ్యూజిక్ డైరెక్టర్ : దాస్ రామసామి
ప్రొడ్యూసర్ : A. సర్కునమ్, హితేష్ ఝబాక్
రిలీజ్ డేట్ : 31 మార్చి 2017
అమాయకురాలైన పారిజాతం(నయనతార) తన తండ్రి రామయ్య(తంబీ రామయ్య) తో కలిసి కాల్ టాక్సీ బిజినెస్ రన్ చేస్తుంటుంది. ఈ క్రమంలో పారిజాతం ఓ వింటేజ్ కార్ ను బిజినెస్ కోసం కొంటుంది. ఆ కారు వల్ల పారిజాతం జీవితంలో ఊహించని ఘటనలు వరుసగా జరుగుతుంటాయి. అసలు ఆ కారుకి పారిజాతానికి ఉన్న సంబంధం ఏంటి? చివరికి ఏమైంది..? ఇలాంటి కథలకు ఇంతకంటే ఎక్కువ రివీల్ చేస్తే సస్పెన్స్ ఉండదు. వెండితెర పై చూడాల్సిందే…

=========================

Pellam-Oorelithe-fpc-పెళ్లా-ఊరెళితే-zeecinemalu

పెళ్లాం ఊరెళితే
నటీనటులు: శ్రీకాంత్, వేణు, సంగీత, రక్షిత,గుండు హనుమంతరావు, కోట శ్రీనివాసరావు, సునీల్,
ఎమ్.ఎస్.నారాయణ, సుమన్ శెట్టి తదితరులు
దర్శకత్వం: ఎస్. వి. కృష్ణారెడ్డి
నిర్మాత: అల్లు అరవింద్
రచన: చింతపల్లి రమణ (మాటలు)
కథ: శక్తి చిదంబరం
సంగీతం: మణిశర్మ
నిర్మాణ సంస్థ: సిరి మీడియా ఆర్ట్స్
శ్రీకాంత్, వేణు హీరోలుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పెళ్లాం ఊరెళితే. సంగీత, రక్షిత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా టాలీవుడ్ లో బెస్ట్ ఎంటర్ టైనర్ గా గుర్తింపు తెచ్చుకుంది. భార్యాభర్తల మధ్య అభిప్రాయాల బేధాలు, గిల్లికజ్జాల్ని సరదాగా చూపించింది ఈ సినిమా. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2003లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సునీల్ కామెడీ, మణిశర్మ సంగీతం ఎక్స్ ట్రా
ఎట్రాక్షన్స్.

===========================

nenu-local-zeecinemalu

నేను లోకల్
నటీనటులు : నాని, కీర్తి సురేష్
ఇతర నటీనటులు : నవీన్ చంద్ర, సచిన్ ఖేడేకర్, తులసి, రామ్ ప్రసాద్, రావు రమేష్ మరియు
తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : త్రినాథ రావు నక్కిన
ప్రొడ్యూసర్ : దిల్ రాజు
రిలీజ్ డేట్ : 3 ఫిబ్రవరి 2017
బాబు (నాని) అనే కుర్రాడు తన పేరెంట్స్ కోసం ఎట్టకేలకు దొంగదారిలో తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తాడు. అలా గ్రాడ్యుయేట్ అయిపోయి ఖాళీగా ఉన్న బాబు… ఒకానొక సందర్భంలో కీర్తి(కీర్తి సురేష్) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. అలా ప్రేమలో పడిన బాబు తన నెక్స్ట్ పనులన్నింటినీ పక్కన పెడతాడు. కీర్తిపైనే పూర్తి ఫోకస్ పెట్టి ఆమె చదివే ఎంబీఏ కాలేజ్ లోనే జాయిన్ అయి.. ఎట్టకేలకి కీర్తిని తన ప్రేమలో పడేస్తాడు. బాబుకు కీర్తినిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేని కీర్తి తండ్రి(సచిన్ ఖేడేకర్) సబ్ ఇనస్పెక్టర్ సిద్దార్థ్ వర్మ(నవీన్ చంద్ర)తో కీర్తి పెళ్లి నిశ్చయిస్తాడు. చివరికి బాబు తన లోకల్ తెలివితేటలతో సిద్దార్థ్ వర్మని సైడ్ చేసి.. కీర్తి తండ్రిని ఎలా ఒప్పించాడు….తన ప్రేమని ఎలా దక్కించుకున్నాడనేది మిగతా కథ.

=========================

hyper-zeecinemalu

హైపర్
నటీనటులు : రామ్ పోతినేని, రాశిఖన్నా
ఇతర నటీనటులు : సత్యరాజ్, నరేష్, రావు రమేష్, తులసి శివమణి, ప్రభాస్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జిబ్రాన్
డైరెక్టర్ : సంతోష్ శ్రీనివాస్
ప్రొడ్యూసర్ : రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర
రిలీజ్ డేట్ : 30 సెప్టెంబర్ 2016
వైజాగ్ లో ప్రభుత్వ ఆఫీస్ లో ఉద్యోగిగా పనిచేసే నారాయణ మూర్తి(సత్య రాజ్) కొడుకు సూర్య( రామ్) తన నాన్నని అమితంగా ప్రేమిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. అయితే అంతలో ఎంతో నిజాయితీగా ఉద్యోగం చేస్తూ త్వరలో రిటైర్ కాబోయే నారాయణ మూర్తిని టార్గెట్ చేస్తాడు మినిస్టర్
రాజప్ప(రావు రమేష్). అలా నారాయణమూర్తిని టార్గెట్ చేసిన రాజప్ప… గజ(మురళి శర్మ)తో కలిసి నారాయణ మూర్తిని చంపాలని చూస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సూర్య తన తండ్రిని ఎలా కాపాడుకున్నాడు. మినిస్టర్ రాజప్పను ఎలా సవాలు చేసి ఎదుర్కొన్నాడు? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

===========================

సీత ఆన్ ది రోడ్
నటీనటులు – కల్పికా గణేష్‌, నేసా ఫర్హాది, గాయత్రీ గుప్తా, ఖతేరా హకీమీ, ఉమా లింగయ్య
కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం – ప్రణీత్ యారోన్
సంగీతం – ప్రణీత్ యారోన్
కల్పికా గణేష్‌, నేసా ఫర్హాది, గాయత్రీ గుప్తా, ఖతేరా హకీమీ, ఉమా లింగయ్య ప్రధాన పాత్రల్లో ప్రణీత్‌ యారోన్‌ దర్శకత్వం వహించిన సినిమా ‘సీత ఆన్‌ ది రోడ్‌’. ముందుగా జీప్లెక్స్‌లో డైరక్ట్ గా రిలీజైంది ఈ సినిమా. ఆ తర్వాత ‘జీ 5’ రిలీజైంది.
ఐదుగురు అమ్మాయిలు, జీవితంలో వాళ్లకు ఎదుదైన కఠినమైన పరిస్థితుల నేపథ్యంలో ‘సీత ఆన్‌ ది రోడ్‌’ సినిమా తెరకెక్కింది. ముఖ్యంగా స్త్రీలు సమాజంలో ఎటువంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు? ఎన్ని కఠిన పరిస్థితులను తట్టుకొని జీవిస్తున్నారు? వంటి అంశాలను అత్యంత సహజంగా చూపించిన చిత్రమిది.
ఐదుగురి నేపథ్యం ఏమిటి? వాళ్లు ఎలా కలిశారనేది ఆసక్తికరమైన అంశం. ప్రధాన పాత్రధారుల నటనకు, స్వరాలు, నేపథ్య సంగీతానికి ప్రశంసలు దక్కాయి. కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రణీత్‌ యారోన్‌ ఈ చిత్రానికి సంగీతం కూడా అందించాడు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics