జీ సినిమాలు (06-12-16)

Monday,December 05,2016 - 09:00 by Z_CLU

punya-dampathulu

నటీనటులు : శోభన్ బాబు, సుహాసిని

ఇతర నటీనటులు : నూతన్ ప్రసాద్, వీరభద్ర రావు, రమాప్రభ, జయమాలిని, కృష్ణవేణి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : అనిల్ కుమార్

ప్రొడ్యూసర్స్ : B. బుల్లి సుబ్బారావు, K. వెంకటేశ్వర రావు

రిలీజ్ డేట్ : 1986

భార్యా భర్తల అనుబంధానికి సరైన నిర్వచనం చెప్పిన ఇమోషనల్ ఎంటర్ టైనర్ పుణ్య దంపతులు. అనిల్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా శోభన్ బాబు కరియర్ లో మైలురాయి  లాంటిది. చక్రవర్తి సంగీతం సినిమాకి హైలెట్.

====================================

english-vnglish

నటీనటులు – శ్రీదేవి, ప్రియా ఆనంద్, మెహ్దీ నెబూ, ఆదిల్ హుస్సేన్

సంగీతం – అమిత్ త్రివేది

దర్శకత్వం – గౌరీ షిండే

విడుదల తేదీ – 2012, సెప్టెంబర్ 14

అతిలోకసుందరి శ్రీదేవి  గ్రాండ్ గా  రీఎంట్రీ ఇచ్చిన మూవీ ఇంగ్లిష్ వింగ్లిష్.  అప్పట్లో శ్రీదేవికి ఎంత పేరు ఉండేదో, తిరిగి అంత క్రేజ్ ను ఓవర్ నైట్ లో ఆమెకు తీసుకొచ్చింది ఈ సినిమా. తనలో నటనా పటిమ ఏమాత్రం తగ్గలేదని శ్రీదేవి నిరూపించుకున్న సినిమా ఇది. ఒక సాధారణ గృహిణి విదేశాలకు వెళ్లినప్పుడు, ఇంగ్లిష్ తెలియక ఎలా ఇబ్బందిపడింది.. దాన్నుంచి సక్సెస్ ఫుల్ గా ఎలా బయటపడి.. ఓ స్వతంత్ర మహిళగా ఎదిగిందనేదే ఈ స్టోరీ. ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో శ్రీదేవి యాక్టింగ్ టాలెంట్ మనకు కనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్, అజిత్ గెస్ట్ రోల్స్ పోషించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా హిట్ అయింది.

=========================================

vijay-main

నటీనటులు : అక్కినేని నాగార్జున, విజయ శాంతి

ఇతర తారాగణం : మోహన్ బాబు, జయసుధ, జగ్గయ్య, నూతన్ ప్రసాద్, శరత్ బాబు, అల్లు రామలింగయ్య, సుత్తివేలు, నర్రా వెంకటేశ్వర రావు, చలపతి రావు.

సంగీతం : చక్రవర్తి

డైరెక్టర్ : బి. గోపాల్

నిర్మాత : అక్కినేని వెంకట్

=======================================

dheepavali

నటీనటులు : వేణు తొట్టెంపూడి, మేఘా నాయర్, ఆర్తి అగర్వాల్

ఇతర నటీనటులు :  బ్రహ్మాజీ, బ్రహ్మానందం, భానుచందర్, వినోద్ కుమార్

మ్యూజిక్ డైరెక్టర్ : వందేమాతరం శ్రీనివాస్

డైరెక్టర్ : హరిబాబు

ప్రొడ్యూసర్ : తీగల కృపాకర్ రెడ్డి

రిలీజ్ డేట్ : 2007

వేణు, ఆర్తి అగర్వాల్, మేఘా నాయర్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ దీపావళి. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సినిమాకే హైలెట్.

 ===================================

seenugadu-love-story

హీరోహీరోయిన్లు – ఉదయనిథి స్టాలిన్, నయనతార

సంగీతం – హరీష్ జైరాజ్

దర్శకత్వం – ఎస్.ఆర్ ప్రభాకరన్

విడుదల తేదీ – 2015

అప్పటికే ఓకే ఓకే సినిమాతో తెలుగులో కూడా పెద్ద హిట్ అందుకున్నాడు ఉదయ్ నిధి స్టాలిన్. ఆ ఉత్సాహంతో 2014లో విడుదలైన తన తమిళ సినిమాను… శీనుగాడి లవ్ స్టోరీ పేరుతో తెలుగులోకి కూడా డబ్ చేసి రిలీజ్ చేశాడు. నయనతార హీరోయిన్ గా నటించడంతో ఈ సినిమాకు తెలుగులో కూడా రీచ్ పెరిగింది. పైగా తెలుగులో ఓకేఓకే హిట్ అవ్వడంతో.. శీనుగాడి లవ్ స్టోరీకి కూడా క్రేజ్ ఏర్పడింది. ప్రభాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు హరీష్ జైరాజ్ సంగీతం అందించాడు. ఈ సినిమాకు కూడా ఎప్పట్లానే తానే నిర్మాతగా వ్యవహరించాడు ఉదయ్ నిథి స్టాలిన్.

========================================

ee

నటీనటులు : జీవా, నయనతార

ఇతర నటీనటులు : పశుపతి, ఆశిష్ విద్యార్థి, కరుణాస్, రాజేష్, అజయ్ రత్నం, చరణ్ రాజ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీకాంత్ దేవ

డైరెక్టర్ : S.P. జగన్నాథన్

ప్రొడ్యూసర్ : R.B.చౌదరి

రిలీజ్ డేట్ : 20 అక్టోబర్ 2006

బాధ్యతా రాహిత్యంగా తిరిగే ఒక మాస్ కుర్రాడు, ఒక బార్ డ్యాన్సర్ జ్యోతిని కలుసుకుంటాడు. అతని గతాన్ని తెలుసుకున్న జ్యోతి, చిన్నగా అతనికి జీవితమంటే ఏంటో, దాని విలువేంటో తెలియజేసే ప్రయత్నం చేస్తుంటుంది. ఇంతలో వారికి తెలిసిన ఒక నిజం ఇద్దరి జీవిత లక్ష్యాన్నే  మార్చేస్తుంది. జీవా, నయనతార నటించిన సినిమా రిలీజైన అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్టయింది.