కొత్త సినిమా ప్రిపరేషన్స్ లో వరుణ్ తేజ్

Monday,February 12,2018 - 07:04 by Z_CLU

తొలిప్రేమ ఫీవర్ ఇంకా తగ్గనే లేదు అప్పుడే వరుణ్ తేజ్ తన నెక్స్ట్ సినిమా కోసం ప్రిపరేషన్స్ బిగిన్ చేసేశాడు. ‘ఘాజి’ మూవీ డైరెక్టర్ సంకల్ప్  డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఆస్ట్రోనాట్ గా కనిపించనున్నాడు వరుణ్ తేజ్. స్పేస్ బేస్డ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకోనున్నాడు వరుణ్ తేజ్.

హైదరాబాద్ తో పాటు జార్జియాలో జీరో గ్రావిటీ కండిషన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకోబోతున్నాడు వరుణ్ తేజ్. జీరో గ్రావిటీ కండిషన్ కి సూట్ అయ్యేలా, బరువు తగ్గనున్న వరుణ్ తేజ్, ఆ కండిషన్స్ లో బాడీని బ్యాలన్స్ చేసుకునే ట్రైనింగ్ కోసం కుదిరితే బ్యాంకాక్ లేదా కజకిస్తాన్ వెళ్ళే ప్రిపరేషన్స్ లో  ఉన్నాడు వరుణ్ తేజ్.

 

వరుణ్ తేజ్ తో పాటు తక్కిన నటీనటులను కూడా ఈ ట్రైనింగ్ ఇప్పించే ప్లానింగ్ లో ఉన్న సినిమా యూనిట్, మ్యాగ్జిమం ఏప్రియల్ లో సినిమాను సెట్స్ పైకి తీసుకు వచ్చే ఆలోచనలో  ఉన్నారు. ఈ సినిమా తన కరియర్ లో స్పెషల్ మూవీగా నిలిచిపోవడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్న వరుణ్ తేజ్, నెల రోజుల పాటు ఈ ట్రైనింగ్ కోసం టైమ్ కేటాయిస్తున్నాడు. ‘ఘాజి’ లాంటి డిఫెరెంట్ ఎంటర్ టైనర్ తరవాత సంకల్ప్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా చుట్టూ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది.