కోలీవుడ్ ఫైర్ బ్రాండ్.. టాలీవుడ్ ఎంట్రీ

Tuesday,February 12,2019 - 06:19 by Z_CLU

వరలక్ష్మీ శరత్ కుమార్.. కోలీవుడ్ లో ఈమెకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈమెకక్కడ ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ ఉంది. ఏడేళ్ల కిందటే కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇన్నాళ్లూ తమిళ, కన్నడ, మలయాళ సినిమాలకే పరిమితమైంది. ఇప్పుడు తెలుగులో న్యూ-జర్నీ స్టార్ట్ చేయబోతోంది.

అవును.. వరలక్ష్మీ శరత్ కుమార్ టాలీవుడ్ ఎంట్రీ కన్ ఫర్మ్ అయింది. సందీప్ కిషన్, హన్సిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తెనాలి రామకృష్ణ సినిమాలో ఓ కీలక పాత్రకు ఈమె సెలక్ట్ అయింది. ఈనెల 16 నుంచి వరలక్ష్మిపై షూట్ స్టార్ట్ చేస్తారు.

తెలుగులో నేరుగా సినిమా చేయనప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా వరలక్ష్మి పరిచయమే. రీసెంట్ గా వచ్చిన పందెంకోడి-2, సర్కార్ సినిమాలు ఈమెను తెలుగు ఆడియన్స్ కు దగ్గరచేశాయి. అందుకే ఇప్పుడు టాలీవుడ్ లో కూడా స్ట్రయిట్ మూవీస్ ఒప్పుకుంటోంది వరలక్ష్మి.

అయితే కోలీవుడ్ లో పవర్ ఫుల్ పాత్రలకు కేరాఫ్ గా నిలిచిన వరలక్ష్మికి, టాలీవుడ్ నుంచి అలాంటి బలమైన క్యారెక్టర్లు వస్తాయా అనేది డౌట్. ఎందుకంటే తెలుగులో హీరో సెంట్రిక్ సినిమాలే ఎక్కువ. హీరోయిన్ కు, క్యారెక్టర్ ఆర్టిస్టుకు వెయిట్ ఉండే పాత్రలు చాలా తక్కువగా వస్తుంటాయి. వరలక్ష్మి కోసం మన మేకర్స్ ఇకపై అలాంటి క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.