మహేష్ మూవీపై క్లారిటీ ఇచ్చిన వంశీ పైడిపల్లి

Friday,October 27,2017 - 06:30 by Z_CLU

మహేష్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ సినిమాకు రంగం సిద్ధమౌతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చే ఏడాది నుంచి సెట్స్ పైకి రానున్న ఈ సినిమాకు ఓ మంచి టైటిల్ కోసం వెదుకుతున్నారు. ఇంతలోనే ఈ మూవీ టైటిల్ పై పుకార్లు ప్రారంభమయ్యాయి. ఈ సినిమాకు “కృష్ణా ముకుందా మురారి” అనే టైటిల్ ఫిక్స్ చేశారని కొందరు.. “హరే రామ, హరే కృష్ణ” అనే టైటిల్ పెట్టారంటూ మరికొందరు పుకార్లు పుట్టించారు. ఎట్టకేలకు ఈ వార్తలపై స్పందించాడు దర్శకుడు వంశీ పైడిపల్లి.

“మహేష్ 25వ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. కృష్ణా ముకుందా మురారి, హరే రామ హరే కృష్ణ లాంటి టైటిల్స్ అనుకోవడం లేదు. సరైన టైటిల్ ఫిక్స్ చేసిన తర్వాత అందరికీ అధికారికంగా ప్రకటిస్తాం.” దర్శకుడు వంశీ పైడిపల్లి తాజా ట్వీట్ ఇది.

పైడిపల్లి ట్వీట్ తో మహేష్ 25వ సినిమా టైటిల్ పై ఇన్నాళ్లూ వచ్చిన పుకార్లకు చెక్ పడింది. దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు.