NTR Hrithik నవంబర్ నుండి 'వార్ 2'

Wednesday,April 12,2023 - 03:47 by Z_CLU

Updates : Hrithik Roshan, NTR’s ‘War2’ shoot starts from November

RRR తో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు అందుకున్న ఎన్టీఆర్ వార్ 2 తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. హృతిక రోషన్ తో కలిసి ఈ సినిమాలో నటించనున్నాడు ఎన్టీఆర్. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే ఎనౌన్స్ అయింది. ప్రస్తుతం అయాన్ ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు. నవంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తుంది.

ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. NTR30 గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించి కీ షెడ్యూల్స్ నవంబర్ లోపు పూర్తి చేసి వార్ 2 షూటింగ్ మొదలు పెట్టనున్నాడు ఎన్టీఆర్. సిద్దార్థ ఆనంద్ తీసిన వార్ బాలీవుడ్ తో పాటు తెలుగులోనూ మంచి వసూళ్లు రాబట్టింది.

వార్ కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలా కనిపిస్తాడు ? హృతిక్ , ఎన్టీఆర్ కాంబో ఎలా ఉండబోతుందనే ఆసక్తి ఉన్నారు ఫ్యాన్స్. ఈ క్రేజీ కాంబో ఈ సీక్వెల్ తో రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ భావిస్తుంది.