Mahesh Trivikram Movie - సెకండ్ హీరోయిన్ ఆమెనా?

Sunday,July 25,2021 - 10:46 by Z_CLU

ఈ మధ్య కొందరు దర్శకుల సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ ని చూస్తూన్నం. ఇక త్రివిక్రమ్ కూడా అందులో ఒకరు. అవును త్రివిక్రమ్ తీసిన లేటెస్ట్ సినిమాల లిస్టు చూస్తే అందులో కచ్చితంగా ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. ఇది త్రివిక్రమ్ కి సెంటిమెంట్ అనుకోవచ్చు లేదా ఇద్దరి గ్లామర్ సినిమాకు ప్లస్ అవుతుందనే ఐడియా కావచ్చు. ఏదేమైనా ఇద్దరు మాత్రం కామన్ గా కనిపిస్తారు.

తాజాగా మహేష్ తో త్రివిక్రమ్ సినిమా ఎనౌన్స్ అయినప్పటి నుండి సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరనేది అందరిలో ఆసక్తి నెలకొలుపుతుంది. మెయిన్ గా హీరోయిన్ గామళ్ళీ పూజా హెగ్డే నే త్రివిక్రమ్ రిపీట్ చేయనున్నాడనే టాక్ వినబడుతుండగా తాజాగా సెకండ్ హీరోయిన్ కోసం త్రిష ని సంప్రదిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇటివలే త్రిష ని కలిసి సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ కి త్రివిక్రమ్ నరేషన్ ఇచ్చాడని అంటున్నారు.

trisha-age-zee-cinemalu

హీరోయిన్ త్రిష

ఇక మహేష్ -త్రివిక్రమ్ కాంబో అంటే అందరికి గుర్తొచ్చే మొదటి సినిమా అతడు. ఈ సినిమాతో మేజిక్ క్రియేట్ చేశారు మహేష్ -త్రివిక్రమ్. ఇక అందులో త్రిష కూడా హీరోయిన్ పార్ట్ అన్న విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడీ ప్రాజెక్ట్ లోకి త్రిష ని కూడా తీసుకొని ఆమెతో ఓ పాత్ర చేయించాలనే ఆలోచనలో ఉన్నాడట త్రివిక్రమ్.

ఇక త్రిష కంటే ముందు కొంత మంది హీరోయిన్స్ పేర్లు వినిపించగా ఇప్పుడు త్రిష్ నే సెకండ్ హీరోయిన్ గా ఫైనలైజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని టాక్ నడుస్తుంది. మరి చూడాలి నిజంగా త్రివిక్రమ్ మరోసారి ఈ సినిమా ద్వారా త్రిష్ వర్క్ చేస్తాడా ? లేదా మరో ఫ్రెష్ కాంబో ఏమైనా సెట్ చేసుకుంటాడా ?

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics