టాక్సీవాలా ట్రయిలర్ రివ్యూ

Monday,November 12,2018 - 11:36 by Z_CLU

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా ట్రయిలర్ రిలీజైంది. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా ఈ సినిమా ట్రయిలర్ ను లాంచ్ చేశారు. ఎలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా, అంచనాలు పెంచకుండా ట్రయిలర్ లోనే సింపుల్ గా మేటర్ చెప్పేశారు.

విజయ్ దేవరకొండ ఓ టాక్సీవాలా. కష్టపడి సెకెండ్స్ లో ఓ కారు కొనుక్కుంటాడు. అతడికి హీరోయిన్ ఎలా పరిచయం అవుతుంది.. అసలు టాక్సీలో ఏముంది.. టాక్సీకే ప్రాణం, క్యారెక్టర్ ఉంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కిందనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది.

ట్రయిలర్ లో ఎప్పట్లానే తన టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు దేవరకొండ. హీరోయిన్ ప్రియాంక క్యూట్ గా బాగుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవెల్ లో ఉన్నాయి. ఈనెల 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది టాక్సీవాలా.