రవితేజ సినిమాతో మళ్ళీ కమెడియన్ గా ?

Sunday,December 24,2017 - 09:06 by Z_CLU

ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న రవి తేజ త్వరలో శ్రీను వైట్ల డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాతో మళ్ళీ కమెడియన్ గా పరిచయ కాబోతున్నాడట సునీల్. ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్న సునీల్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో మళ్ళీ కమెడియన్ గా నటిస్తానని అలాంటి రోల్స్ వస్తే సినిమాలు చేస్తానని ప్రకటించాడు కూడా.

రవితేజ తో యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కించనున్న శ్రీను వైట్ల ఇటీవలే సునీల్ కోసం ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ క్రియేట్ చేసాడని, ఆ రోల్ చేసేందుకు సునీల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని సమాచారం. సో రవితేజ సినిమాతో సునీల్ మళ్ళీ కమెడియన్ గా మారబోతున్నాడన్నమాట.