Sundeep Kishan - మరో డిఫరెంట్ మూవీ

Thursday,December 17,2020 - 08:17 by Z_CLU

కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ క్యారెక్టర్స్ సెలక్ట్ చేసుకుంటున్నాడు హీరో సందీప్ కిషన్. ఇప్పుడీ హీరో మరో సినిమా స్టార్ట్ చేశాడు. ఈ సినిమా పేరు రౌడీ బేబీ.

మూవీ లాంఛనంగా మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ క్లాప్‌ కొట్టగా, సహ నిర్మాత జీవీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కోన వెంకట్‌ ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.

Sundeep-Kishan_Neha-Shetty-Rowdy_baby-movie 4

కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జాతీయ అవార్డ్‌ విన్నింగ్‌ యాక్టర్‌ బాబీ సింహ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Sundeep-Kishan_Neha-Shetty-Rowdy_baby-movie 4

ఇదొక కామెడీ మూవీ. సినిమా మొత్తం కామెడీ ఉంటుందంటున్నారు మేకర్స్. వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో సినిమాను సింగిల్‌ షెడ్యూల్‌లో పూర్తి చేయడానికి సన్నాహాలు చేశారు. ఫిబ్రవరి ఎండింగ్ కు షూటింగ్‌ పూర్తవుతుంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను రిలీజ్ చేయాలనేది ప్లాన్.

Sundeep-Kishan_Neha-Shetty-Rowdy_baby-movie 4

నటీనటులు:
సందీప్‌కిషన్‌, నేహాశెట్టి, బాబీ సింహ, హర్ష, వెన్నెలకిశోర్‌, పోసాని కృష్ణమురళి, షకలక శంకర్‌ తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: జి.నాగేశ్వర్‌ రెడ్డి
కథ: బాను
డైలాగ్స్‌: నందు
ఆర్ట్‌: చిన్నా
కెమెరా: సుజాత సిద్ధార్థ్‌
సంగీతం: చౌరస్తా రామ్‌
స్టంట్స్‌: రియల్‌ సతీశ్‌
ఎడిటింగ్‌: ఛోటా కె.ప్రసాద్‌
కాస్ట్యూమ్స్‌: నీరజ కోన
సహ నిర్మాత: జీవీ
సమర్పణ: కోన వెంకట్‌
నిర్మాత: ఎంవీవీ సత్యనారాయణ
పి.ఆర్‌.ఓ: వంశీ కాక