A1 Express - రెడీ ఫర్ రిలీజ్

Tuesday,February 23,2021 - 12:57 by Z_CLU

టాలెంటెడ్ హీరో సందీప్ కిష‌న్ న‌టిస్తోన్న 25వ చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. టాలీవుడ్‌లో రూపొందుతోన్న తొలి హాకీ ఫిల్మ్‌గా గుర్తింపు పొందిన ఈ న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్ హీరో సందీప్ కిష‌న్‌కి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.

డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ మూవీలో లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించారు‌. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం నిర్మిస్తున్నారు.

‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ మార్చి 5న విడుద‌ల‌వుతుంద‌ని ఎనౌన్స్ చేస్తూ చిత్ర బృందం స‌రికొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ రొమాంటిక్ పోస్ట‌ర్‌లో హీరోయిన్ లావ‌ణ్యా త్రిపాఠిని వీపుమీద ఎత్తుకొని ఉన్నాడు హీరో సందీప్ కిష‌న్‌. ఇద్ద‌రూ హాయిగా న‌వ్వులు చిందిస్తున్నారు. వారి మ‌ధ్య కెమిస్ట్రీ అమేజింగ్ అనిపిస్తోంది.

ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైల‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ ల‌భించింది. హిప్ హాప్ త‌మిళ మ్యూజిక్ అందించిన పాట‌లు ఇప్ప‌టికే సంగీత ప్రియులను అమితంగా అల‌రిస్తున్నాయి. ఈ సినిమా కోసం బ‌రువు త‌గ్గి సిక్స్ ప్యాక్ బాడీని సాధించాడు సందీప్ కిషన్.