Akhanda టెన్షన్ ఉంది కారణం అదే -శ్రీకాంత్

Thursday,November 25,2021 - 04:50 by Z_CLU

Srikanth feels nervous about his character in Akhanda

విలన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన హీరో శ్రీకాంత్ మళ్ళీ విలన్ గా మారి ‘అఖండ’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలకృష్ణ -బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 2న థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మీడియాతో తన రోల్ గురించి మాట్లాడాడు. ఆ విశేషాలు శ్రీకాంత్ మాటల్లోనే.

బోయపాటి గారు మాటిచ్చారు 

బోయపాటి గారితో ‘సరైనోడు’ అనే సినిమా చేశాను. అందులో సాఫ్ట్ క్యారెక్టర్ ప్లే చేశాను. ఆ టైంలో బోయపాటి గారు మీ కోసం నేను మంచి విలన్ క్యారెక్టర్ రాస్తాను అని చెప్పారు. చెప్పినట్టే ఆయన ‘అఖండ’ కథ చెప్పి నన్ను విలన్ గా మార్చారు.

ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు

నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ‘యుద్ధం శరణం’ సినిమాలో విలన్ గా నటించాను. ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు అఖండ లో మళ్ళీ విలన్ గా చేస్తున్నాను. ఈ సినిమా నాకు నటుడిగా మరింత గుర్తింపు తెస్తుందని నమ్ముతున్నాను.

చాలా కేర్ తీసుకున్నారు

నన్ను విలన్ గా అనుకున్న వెంటనే నా లుక్ కోసం బోయపాటి చాలా కేర్ తీసుకున్నారు. పర్ఫెక్ట్ కాస్ట్యూమ్ , మేకప్ కోసం టైం తీసుకున్నారు. లుక్ ఫైనల్ అయ్యాక హమ్మయ్యా అనుకున్నాం. నన్ను ఓ పవర్ ఫుల్ విలన్ గా చూపించడానికి బోయపాటి గారు చాలా కష్ట పడ్డారు.

ఇది రెండో సారి

బాలకృష్ణ గారితో ఇంతకు ముందు ‘శ్రీరామ రాజ్యం’ సినిమాలో నటించాను. అందులో ఆయనకి తమ్ముడిగా  లక్ష్మణుడి  పాత్ర చేశాను. ఇప్పుడు అపోజిట్ విలన్ గా చేశాను. ఆయనతో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ సూపర్బ్. ఆయన ముందు యాక్ట్ చేయడం కష్టం కూడా. సినిమాలో ఇద్దరం కలిసి చేసిన ఒక సీన్ కి థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆ సీన్ నా ఫేవరేట్.

టెన్షన్ గానే ఉంది 

సినిమాలో నా క్యారెక్టర్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా ? అని ఆతృతగా ఎదురుచూస్తున్నాను. కారణం పవర్ ఫుల్ విలన్ గా ఆడియన్స్ నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారా అనే భయం ఉంది. పైగా రేపులు , మర్డర్లు ఉంటాయి. నన్ను హీరోగా ఇష్టపడే వారు ఆ సీన్స్ చూసి ఎలా ఫీలవుతారో అనే టెన్షన్ ఉంది. రిలీజ్ తర్వాత ఆడియన్స్ ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇస్తారా అని ఎదురుచూస్తున్నను.

ఆ సినిమాలో రోల్ గురించి చెప్పలేను 

పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన సినిమాలో విలన్ గా నటించాను. అది రిలీజ్ కి రెడీగా ఉంది. అలాగే శంకర్ -రామ్ చరణ్ సినిమాలో నటిస్తున్నాను. ఆ సినిమాలో రోల్ గురించి ఇప్పుడే ఏం చెప్పలేను. కానీ మంచి క్యారెక్టర్ చేస్తున్నా. నెగిటివా ? పాజిటివా ? అనేది ఇప్పుడే చెప్పను.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics