చైతూ స్టామినా: 3 రోజుల్లో 23 కోట్లు

Sunday,September 16,2018 - 10:01 by Z_CLU

తన కెరీర్ లోనే ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ చేశానని చెబుతున్న నాగచైతన్య, చెప్పినట్టుగానే సూపర్ హిట్ కొట్టాడు. మారుతి దర్శకత్వంలో చైతూ నటించిన శైలజారెడ్డి అల్లుడు సినిమా రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. మొదటి రోజే భారీ వసూల్లతో కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న చైతూ.. 3 రోజులు తిరిగేసరికి మరో రికార్డు సృష్టించింది. ఏకంగా 23 కోట్ల రూపాయల గ్రాస్ సాధించాడు.

వినాయకచవితి కానుకగా విడుదలైన శైలజారెడ్డి అల్లుడు సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అక్కడక్కడ మిక్స్ డ్ టాక్ ఉన్నప్పటికీ, ఓవరాల్ గా సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. పైగా వీకెండ్ కూడా యాడ్ అవ్వడంతో వసూళ్ల వర్షం కురిపిస్తోంది శైలజారెడ్డి అల్లుడు.

వీకెండ్ ముగిసేనాటికి ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలున్నాయి. ఎందుకంటే, శైలజారెడ్డి అల్లుడు యూత్ తో పాటు ఫ్యామిలీస్ కు కనెక్ట్ అయ్యాడు మరి.