Love Story - దుమ్మురేపుతున్న సాంగ్

Monday,March 15,2021 - 01:07 by Z_CLU

దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న దృశ్య కావ్యం లవ్ స్టోరి. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా విడుదలకు ముందే సంచలనాలు క్రియేట్ చేస్తోంది. కారణం.. సారంగదరియా సాంగ్.

రెండు వారాల కిందట రిలీజ్ చేసిన ‘సారంగ దరియా’ పాట ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ క్లబ్ లో చేరింది. ఫిబ్రవరి 28న సమంత చేతుల మీదుగా విడుదలైన సారంగ దరియా పాట కేవలం 14 రోజుల్లో 50 మిలియన్ వ్యూస్ మార్క్ చేరుకుంది.

సాయి పల్లవి చేసిన పాట రౌడీ బేబీ ఒక్కటే 8 రోజుల్లో ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ కు రీచ్ అయి సారంగ దరియా కంటే ముందుంది. మిగతా సూపర్ హిట్ సాంగ్స్ బుట్ట బొమ్మ, రాములో రాములా పాటలు సారంగ దరియా స్పీడ్ కంటే వెనకబడ్డాయి. బుట్ట బొమ్మ పాటకు 50 మిలియన్ వ్యూస్ వచ్చేందుకు 18 రోజులు పట్టగా, రాములో రాములా పాటకు 27 రోజులు పట్టింది.

సుద్దాల అశోక్ తేజ సాహిత్యాన్ని అందించిన సారంగ దరియా పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఇచ్చాడు. పవన్ సీహెచ్ సంగీతం ఈ తెలంగాణ జానపద గీతానికి అద్భుతంగా కుదిరింది. మంగ్లీ గొంతులో పలికిన మరో సూపర్ హిట్ సాంగ్ సారంగ దరియా. ఇన్ని స్పెషాలిటీస్ తో ఏప్రిల్ 16న ”లవ్ స్టోరి” సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.