Samantha Goa Trip - 2021 ఫినిషింగ్ టచ్

Wednesday,December 29,2021 - 05:03 by Z_CLU

ఏ ఏడాదికి గ్రాండ్ గా గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుంది సమంత. డిసెంబర్ 31 రాత్రిని ఫుల్ గా ఎంజాయ్ చేయాలని గట్టిగా ప్లాన్ చేసింది. అందుకే 3 రోజులు ముందే గోవా చేరుకుంది. సమంతకు ఎంతో ఇష్టమైన ప్లేస్ గోవా. అందుకే తన ఫ్రెండ్స్ తో కలిసి కొన్ని రోజుల ముందే అక్కడకు చేరుకుంది.

గోవా వెళ్లిన మొదటి రోజు నుంచి తన ఎంజాయ్ మెంట్ ను ఇనస్టాగ్రామ్ లో బయటపెడుతూనే ఉంది సమంత. గోవా స్వర్గాన్ని తలపిస్తుందంటున్న సమంత.. గోవా డైరీస్ పేరిట తన లేటెస్ట్ స్టిల్స్ ను షేర్ చేస్తోంది. అవన్నీ బ్యాక్ టు బ్యాక్ మీ కోసం అందిస్తున్నాం. ఓ లుక్కేయండి.