Akkineni Mega Multistarrer - తేజ్, అఖిల్ కాంబో!

Friday,July 23,2021 - 04:56 by Z_CLU

మెగా హీరో సాయి ధరం తేజ్ , అక్కినేని అఖిల్ కాంబినేషన్ లో సినిమా రానుందనే ప్రచారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అవును ఈ ఇద్దరి కాంబో లో ఓ సినిమా రానుందని టాక్ వినిపిస్తుంది. ఇటివలే ఓ డెబ్యు డైరెక్టర్ తేజ్ కి ఓ స్క్రిప్ట్ వినిపించాడని సమాచారమ్. అందులో మరో హీరో క్యారెక్టర్ కూడా ఉందట. అయితే ఆ పాత్రను మెగా ఫ్యామిలీలోనే మరో హీరోతో చేయిద్దామని అనుకోని మళ్ళీ అఖిల్ అయితే బాగుంటుందనే ఆలోచనకి వచ్చారట.

Republic Movie First Song Launch zeecinemalu

తేజ్ స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి దర్శకుడితో ఫాలప్ లో ఉంటున్నాడట. అఖిల్ నుండి ఇంకా గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని తెలుస్తుంది. అఖిల్ ప్రెజెంట్ సురేందర్ రెడ్డి సినిమాతో బిజీ గా ఉన్నాడు. ప్రస్తుతం ఏజెంట్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మరి ఆ సినిమా గ్యాప్ లో తేజ్ తో కలిసి ఈ సినిమా చేస్తాడా ? తెలియాల్సి ఉంది.

Akhil_akkineni-అఖిల్-zeecinemalu

ఇక అక్కినేని నాగేశ్వరరావు , మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో గతంలో మెకానిక్ అల్లుడు సినిమా వచ్చింది. ఆ తర్వాత చిరు , నాగ్ కలిసి సినిమా చేయాలనుకున్నారు. కానీ ఇంత వరకు కథ కుదరలేదు. మరి ఇప్పుడు తేజ్ , అఖిల్ కలిసి సినిమా చేస్తే అక్కినేని మెగా కాంబినేషన్ ని మరోసారి స్క్రీన్ పై చూడొచ్చని ఆశ పడుతున్నారు మూవీ లవర్స్. ఈ సినిమాకు దర్శకుడెవరు ? నిర్మాత ఎవరు ? అనే డీటెయిల్స్ కూడా తెలియాల్సి ఉంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics