మిస్టరీ థ్రిల్లర్ కథతో సాయితేజ్

Friday,August 14,2020 - 01:36 by Z_CLU

కెరీర్ లో ఎక్కువగా ప్రేమకథలే చేసిన సాయితేజ్, ఇప్పుడిప్పుడే కొత్త జానర్స్ టచ్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా తన కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ ఓ మిస్టరీ థ్రిల్లర్ సినిమా చేయబోతున్నాడు. సుకుమార్ దగ్గర రైటింగ్ డిపార్ట్ మెంట్ లో పనిచేసిన కార్తీక్ దండు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.

బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తారు. అంతేకాదు, ఈ సినిమాకు సుకుమార్ స్వయంగా స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. సో.. ఈ ప్రాజెక్టును SaiTej-Sukumar కాంబోలో వస్తున్న మొదటి సినిమాగా కూడా చూడొచ్చు.

ఈ సందర్భంగా ప్రీ-లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. త్వరలోనే హీరోయిన్ పేరును కూడా ఎనౌన్స్ చేయబోతున్నారు.

ప్రస్తుతం Sai Tej చేతిలో సోలో బ్రతుకే సో బెటరు సినిమా ఉంది. దీని తర్వాత Deva Katta దర్శకత్వంలో ఓ పొలిటికల్ థ్రిల్లర్ చేయబోతున్నాడు. ఆ తర్వాత కార్తీక్ దండు సినిమా స్టార్ట్ అవుతుంది.