VBVK trailer ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో కిరణ్

Tuesday,February 07,2023 - 08:36 by Z_CLU

Sai Dharam Tej launched Kiran Abbavaram ‘Vinaro Bhagyamu Vishnu Katha’ trailer

యంగ్  ప్రామిసింగ్ టాలెంటెడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం Kiran Abbavaram  ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ సినిమాలతో. కిరణ్ ప్రస్తుతం  GA2 బ్యానర్ లో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 17న శివరాత్రి స్పెషల్‌ కానుకగా విడుదల కానుంది.

ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ అందర్నీ ఆకట్టుకోగా, తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ Sai Dharam tej  ఈ ట్రైలర్‌ను లాంచ్ చేసి, టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

దర్శన (కాశ్మీర పరదేశి) అనే తెలియని అమ్మాయి నుండి వచ్చిన ఫోన్ కాల్ ద్వారా విష్ణు (కిరణ్ అబ్బవరం) విధి మార్చబడిందని , ఆమె అతనిని ఎలా చేరుకుందో , మురళీ శర్మ పోషించిన మరొక పాత్రను నంబర్ నైబరింగ్ ద్వారా వివరిస్తుంది. ఈ ముక్కోణపు ప్రేమకథ లో ప్రేమ, ఫన్ మరియు ఎంటర్టైన్మెంట్ మంచి ఆసక్తికరంగా ఉన్నాయి.

నంబర్ నేబరింగ్ తో ప్రశాంతంగా ఉండే విష్ణు లైఫ్ చాలా ఇబ్బందుల్లో పడుతుంది. ఈ విషయాన్ని ట్రైలర్ లో చూపిస్తూ సినిమాపై ఆసక్తి రేకెత్తించారు.   ట్రైలర్ కి బాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్లస్ అయ్యింది. ఈ సినిమా కోసం దర్శకుడు ఎంచుకున్న కొత్త  కాన్సెప్ట్ ఆకట్టుకుంది. కిరణ్ అబ్బవరం యాక్షన్, రొమాన్స్, కామెడీ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి.

మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ సినిమాను  GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్  నిర్మించగా, అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. కశ్మీరా కథానాయికగా నటిస్తుండగా, మురళీ శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. డేనియల్ విశ్వాస్ ఫోటోగ్రఫీ దర్శకుడు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్.