భాగమతి దర్శకుడితో సాయిధరమ్ తేజ్ సినిమా?

Tuesday,December 25,2018 - 03:16 by Z_CLU

ఈ ఏడాది జనవరి లో రిలీజ్ అయి సూపర్ హిట్ ని అందుకున్న సినిమా భాగమతి. అనుష్క లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాని అశోక్ డైరెక్ట్ చేసాడు.

ఇక ఈ సినిమా రిలీజ్ అయి ఏడాది కావొస్తుంది. మళ్లీ ఇన్నాళ్లకు ఓ స్టోరీ రెడీ చేశాడు అశోక్. ఈ కథని సాయి ధరమ్ తేజ్ కి చెప్పాడట. కథ నచ్చిన సాయి ధరం తేజ్ వెంటనే సినిమాకి ఓకే చెప్పిన్నట్టు టాక్.

భాగమతి టైపులోనే ఈ కొత్త సినిమా కూడా హారర్-థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తోనే సాగుతుందట. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ “చిత్రలహరి” సినిమాతో బిజీగా ఉన్నాడు. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి సాయి ధరం తేజ్ ఫ్రీ అవ్వగానే అశోక్ సినిమాపై ఓ క్లారిటీ వస్తుంది.