Raviteja Mahesh - సూపర్ స్టార్ బాటలో మాస్ రాజా

Sunday,July 25,2021 - 10:29 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ ప్రెజెంట్ మూవీస్ అబ్సర్వ్ చేస్తే… తన ప్రతీ సినిమాకు GMB ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ ని ఇంక్లూడ్ చేస్తున్నాడు. శ్రీమంతుడు నుండి ఈ స్టాటజీ స్టార్ట్ చేశాడు సూపర్ స్టార్. ఆ తర్వాత బ్రహ్మోత్సవం , మహర్షి సినిమాలకు ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట సినిమాపై తన బేనర్ నేమ్ ఉండేలా చూసుకుంటున్నాడు. అయితే వీటిలో మహేష్ కి నిర్మాణంలో భాగస్వామ్యం ఉండదు. కేవలం తను తీసుకునే రెమ్యునరేషన్ కి సంబంధించి డీలింగ్ ఉంటుంది అంతే.

అయితే ఇలా చేయడం వలన స్టార్ హీరోలకి ఏం లాభం అనుకోవడానికి లేదు. కొన్ని ఏరియాలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ లేదా మరో బిజినెస్ డీలింగ్ చేసుకొని ఆ ఒప్పందం మేరకు బేనర్ పేరు పెట్టించుకుంటారు. ప్రెజెంట్ మహేష్ తో పాటు మరికొందరు స్టార్ హీరోలు కూడా ఇదే ఫాలో అవ్వబోతున్నారు.

తాజాగా రవితేజ కూడా మహేష్ రూట్లోనే ప్రయాణిస్తున్నాడని తెలుస్తుంది. దీనికి కారణం రవితేజ చేస్తున్న ‘రామారావు’ సినిమా ఫస్ట్ లుక్. అవును ఈ సినిమా పోస్టర్ పై RT టీం వర్క్ అని బేనర్ నేమ్ కనిపిస్తుంది. RT అంటే రవితేజ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది అందరికీ తెలిసిందే. మొన్నీ మధ్య పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే తన పేరు తర్వాత టీం వర్క్ అని పెట్టుకొని బేనర్ స్టార్ట్ చేశాడు.

ఇక రవితేజ కి ఎప్పటి నుండో నిర్మాణంలోకి అడుగుపెట్టాలని ఉంది. అందుకే ఈ సినిమాతో తన బేనర్ స్టార్ట్ చేశాడు. కాకపోతే రవితేజకి సినిమా పెట్టుబడి కి సంబంధం లేదని కేవలం మహేష్ లాగే బిజినెస్ డీలింగ్ కోసమే బేనర్ పేరు వేసుకున్నాడని ఇన్సైడ్ టాక్. కాకపోతే ఈ బేనర్ లో త్వరలో యంగ్ స్టర్స్ తో సినిమాలు నిర్మించే ఆలోచనలో ఉన్నాడట రవితేజ. అలాగే OTT కోసం web మూవీస్ , సిరీస్ లు కూడా వస్తాయని తెలుస్తుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics