రెండు సినిమాలతో ఖుషి చేయబోతున్న చరణ్

Sunday,January 14,2018 - 12:20 by Z_CLU

హీరోగా 2017  క్యాలెండర్  మిస్సైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ఏడాది రెండు  సినిమాలతో అభిమానులను ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవ్తున్నాడు. ఇప్పటికే రంగస్థలం సినిమాను ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజికి తీసుకోచ్చేసిన చరణ్ ఈ సినిమాతో మార్చ్ 30 న థియేటర్స్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సమ్మర్ స్టార్టింగ్ లో రంగస్థలం సినిమాతో డిఫరెంట్ గా ఎంటర్ టైన్ చేయనున్న చరణ్ ఇయర్ ఎండింగ్ లో మరో సినిమాను థియేటర్స్  లోకి తీసుకురావాలని చూస్తున్నాడు.

ఇటివలే బోయపాటి శ్రీనుతో ఓ సినిమా స్టార్ట్ చేసిన చరణ్ ఈ నెలాఖరులో  సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. వీలైనంత ఫాస్ట్ గా ఈ సినిమాను ఫినిష్ చేసి తనకి కలిసోచ్చిన డిసెంబర్ లో అభిమానుల్ని ఎంటర్ టైన్ చేయాలనీ భావిస్తున్నాడట చెర్రీ. సో  సమ్మర్ లో చిట్టి అనే డిఫరెంట్ క్యారెక్టర్ తో మెస్మరైజ్ చేయబోతున్న చరణ్ ఇయర్ ఎందింగ్ కల్లా బోయపాటి తో తెరకేక్కే యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాతో ఫాన్స్ ను మరింత ఖుషి చేయబోతున్నాడన్నమాట.