Priyamani - ‘‘కొటేషన్ గ్యాంగ్’’

Tuesday,September 08,2020 - 05:28 by Z_CLU

ప్రియమణి నటిస్తున్న కొత్త సినిమా ‘‘కొటేషన్ గ్యాంగ్’’.. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ని ఫిల్మీ నాటి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై గాయత్రి సురేష్ నిర్మిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలా దగ్గర అసోసియేట్ గా పనిచేసిన వివేక్.కె డైరెక్ట్ చేస్తున్నారు.

శ్రీమన్నారాయణ, మిరపకాయ్, పైసా లాంటి సినిమాలను హిందీలో డబ్ చేసిన ఫిల్మీ నాటి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించబోతోంది.

జాతీయ అవార్డు గెలుచుకున్న నటి Priyamani ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించనుంది. ధన్యా రాఫియా బాను, వైష్ణో వారియర్, అక్షయ ఇతర నటీనటులు. వీరితో పాటు, ఓ స్టార్ హీరో కూడా ఇందులో కీలక పాత్ర పోషించనున్నారు.

క్రైమ్ థ్రిల్లర్ మూవీ Quotation Gang షూటింగ్ మొత్తం ముంబై, తమిళనాడు మరియు తెలుగు రాష్ట్రాలలో జరుగబోతుంది. మిగతా వివరాలు త్వరలో ఎనౌన్స్ చేస్తారు.