Peddintalludu - నగ్మా మొదటి సినిమాకు 30 ఏళ్లు

Saturday,June 19,2021 - 07:09 by Z_CLU

సుమన్ హీరోగా శరత్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలన్నీ మంచి విజయాలు అందుకున్నాయి. ఆ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం పెద్దింటల్లుడు. శ్రీఅన్నపూర్ణ సినీ చిత్ర బ్యానర్ పై టి ఆర్ తులసి నిర్మించిన ఈ సినిమా 1991లో విడుదలైంది. ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా నగ్మా పరిచయం అయింది. ఈ సినిమా సక్సెస్ తరువాత నగ్మా తెలుగులో వరుస అవకాశాలు అందిపుచ్చుకుని స్టార్ హీరోయిన్ గా సౌత్ లో ఓ వెలుగు వెలిగింది.

Peddintalludu movie zeecinemalu

సుమన్ హీరోగా ఓ వైపు మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూనే మరోవైపు ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూ కుటుంబ కథా చిత్రాలపై ఎక్కువ ఆసక్తి చూపేవారు. అలాగే ఈ సినిమాలో ప్రముఖ నటుడు మోహన్ బాబు కూడా మరో కీ రోల్ పోషించారు. సీనియర్ నటి వాణిశ్రీ మరో భిన్నమైన పాత్రతో ఆకట్టుకున్నపెద్దింటల్లుడు సకుటుంబ సపరివారసమేతంగా చూడదగ్గ చిత్రంగా మంచి కథ, కథనాలతోపాటు కామెడీ ప్రధానాంశంగా సాగుతుంది. ఈ సినిమా విడుదలై ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

Peddintalludu movie zeecinemalu

ఈ సందర్బంగా ఈ చిత్ర కథానాయకుడు సుమన్ మాట్లాడుతూ .. పెద్దింటల్లుడు సినిమా 30 సంవత్సరాలు అవుతుంది. ఈ సినిమా నాకు చాలా వెరైటీ సినిమా. ఎందుకంటే ఇందులో ఓల్డ్ గెటప్ వేయడం…మోహన్ బాబు గారి కాంబినేషన్ లో చేయడం.. వాణిశ్రీ గారితో.. ఇలా నాకు చాలా కొత్త అనుభూతి ఇచ్చిన సినిమా. ఇది తమిళ్ లో నడిగర్ అనే సినిమాకు రీమేక్. పి వాసుగారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాన్నీ శరత్ గారి దర్శకత్వంలో తెలుగులో చేయడం. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. పైగా నాకు మంచి పేరు కూడా వచ్చింది. ఈ సినిమాతో నేను కామెడీ కూడా చేయగలను అని నిరూపించింది. అలా వెర్సటైల్ యాక్టర్ గా పేరుతెచ్చిన సినిమా ఇది.” అన్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics